Site icon HashtagU Telugu

Delhi Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవదహనం..!

Delhi Fire Accident

Delhi Fire Accident

దేశ రాజ‌ధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దిల్లీ గోకుల్​పురి ప్రాంతంలో అర్ధరాత్రి జ‌రిగిన ఈ ఘోర అగ్నిప్రమాదంలో ఏడుగురు మృతి చెంద‌గా, అనేక మందికి తీవ్ర గాయాలు అయ్యాయ‌ని తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు రేగడంతో పూరి గుడెసెల్లో ఉన్నవారంతా బయటకు పరుగులు తీశారని, అయితే అక్క‌డ ఉన్న గుడెసెలులో 60 గుడెసెలు అగ్నికి ఆహుతయ్యాయని స‌మాచారం.

అయితే ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగ‌డంతో కొంద‌రు బ‌యటకు రాలేక మంటల్లో చిక్కుకుపోయారు. దీంతో ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్లు తెలిసింది. ఇక ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్ర‌మంలో మంటలు అదుపులోకి వ‌చ్చిన‌ట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. మ‌రోవైపు క్ష‌గాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిపూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.