Bombs Dropped : యుద్ధ విమానం తప్పిదం.. జనావాసాలపై 8 బాంబులు

ఈ ఘటన పొరపాటున జరిగింది అంటూ దక్షిణ కొరియా(Bombs Dropped) సైన్యం తమ దేశ  పౌరులను క్షమాపణలు కోరింది.

Published By: HashtagU Telugu Desk
South Korea Fighter Jet Drops Bombs Dropped

Bombs Dropped : దక్షిణ కొరియాలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఏకంగా దేశ పౌరులపైనే ఒక యుద్ధ విమానం ఎనిమిది బాంబులను వేసింది. దీంతో 15 మందికిపైగా ప్రజలకు గాయాలయ్యాయి. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని పోచియాన్‌ నగర శివార్లలో ఈ ఘటన చోటుచేసుకుంది.  ఆకస్మికంగా గగనతలం నుంచి బాంబులు పడటంతో  గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించారు. వీళ్లలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఈ ఘటన పొరపాటున జరిగింది అంటూ దక్షిణ కొరియా(Bombs Dropped) సైన్యం తమ దేశ  పౌరులను క్షమాపణలు కోరింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. బాధితులకు పరిహారం అందజేస్తామని, ఘటనపై దర్యాప్తునకు కమిటీని ఏర్పాటు చేస్తామని ఆర్మీ వెల్లడించింది.

Also Read :YS Sharmila : విజయవాడలో ఇల్లు కొన్న షర్మిల.. ఎందుకో తెలుసా ?

ఎలా జరిగింది ? 

  • దక్షిణ కొరియాలోని పోచియాన్‌ నగరం అనేది ఉత్తర కొరియా సరిహద్దుల్లో ఉంది.
  • మార్చి 10 నుంచి 20 వరకు అమెరికా, దక్షిణ కొరియా సైన్యాలు సంయుక్తంగా  పోచియాన్‌ శివార్లలో సైనిక విన్యాసాలు చేయనున్నాయి. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
  • ఈక్రమంలోనే సైనిక విన్యాసాల కోసం అమెరికా, దక్షిణ కొరియా సైన్యాలు గురువారం నుంచి సంయుక్తంగా ప్రాక్టీస్ మొదలుపెట్టాయి.
  • ఇరుదేశాల సైన్యాలు ప్రాక్టీస్ చేస్తుండగా అమెరికా వాయుసేనకు చెందిన కేఎఫ్‌-16 యుద్ధ విమానం తప్పిదం చేసింది.
  • నిర్దేశించిన లక్ష్యంలో ఎంకే-82 బాంబులను జార విడిచే టార్గెట్‌ను కేఎఫ్‌-16  ఫైటర్ జెట్‌కు ఇచ్చారు. అయితే ఇది పొరపాటున పోచియాన్ నగర శివార్లలోని జనావాసాలపైకి వెళ్లి, అక్కడ ఎనిమిది బాంబులను వేసింది.
  • ఈ బాంబుల ధాటికి ఒక చర్చి భవనం, కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి.  ఆయా భవనాల కిటికీలు, పైకప్పులు ధ్వంసమైన ఫొటోలు స్థానిక మీడియాలో ప్రచురితం అయ్యాయి.
  • గతంలోకి వెళితే.. 2022లో అమెరికా, దక్షిణ కొరియా సైన్యాలు సంయుక్త సైనిక విన్యాసాలు చేస్తుండగా ఒక స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిస్సైల్ పొరపాటున ఫైర్ అయింది. అది వేగంగా దూసుకెళ్లి సైనిక స్థావరంలోని గోల్ఫ్  కోర్సులో పడింది. అయితే లక్కీగా ఆ మిస్సైల్‌లోని వార్ హెడ్ పేలలేదు.

Also Read :Hijab Song: హిజాబ్‌పై సాంగ్.. సింగర్‌కు 74 కొరడా దెబ్బలు

  Last Updated: 06 Mar 2025, 12:19 PM IST