దేశవ్యాప్తంగా నిత్యం కొన్ని పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు ఇలా అనేక కారణాల వల్ల నిత్యం ఎంతోమంది మరణిస్తూనే ఉన్నారు. బ్రతుకుతెరువు కోసం వెళ్లినా కూడా అక్కడ కూడా ఏదో ఒక ప్రమాదాలు సంభవించి మరణిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా చత్తీస్‌గఢ్‌లో ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా ఏడుగురు మరణించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా
చత్తీస్‌గఢ్ లో ఒక ఘోర ప్రమాదం జరిగింది. బస్తర్ జిల్లా లోని ఓ గని కుప్పకూలడంతో ఆ ప్రమాదంలో ఏడుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు.
గని ఒక్కసారిగా కుప్పకూలడంతో అందులో నుంచి సున్నపురాయిని వెలికి తీస్తున్న ఏడుగురు కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయి ఊపిరి ఆడక చనిపోయారు. చనిపోయిన ఆ ఏడుగురిలో ఆరుగురు మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో అక్కడున్న వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా ఈ ఘటన నాగార్నర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్గావ్ గ్రామంలో చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన స్థలానికి వెంటనే చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు. కాగా అక్కడే ఏడుగురు మాత్రమే మట్టిని తవ్వుతున్నారు.
Chhattisgarh | Seven people killed while extracting limestone from a mine after it collapsed in the Bastar district pic.twitter.com/20sDD0JEjN
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 2, 2022
అయితే చనిపోయిన వారు గనిలో మట్టిని తవ్వుతండగా ప్రమాదం జరిగిందని, కార్మికులు శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటనతో ఆ ప్రాంతం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు అందరూ ఘటనా స్థలానికి చేరుకునే బోరున వినిపించారు. అయితే ఆ శిథిలాల కింద కేవలం ఏడు మంది మాత్రమే ఉన్నారా ఇంకా ఎవరైనా ఉన్నా అన్న కోణాలపై కూడా సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నట్టు తెలిపారు పోలీసులు.