Site icon HashtagU Telugu

Twitter: ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ కి భారీ ఘలక్ ఇచ్చిన మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్?

Twitter

Twitter

ప్రముఖ సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ గురించి మనందరికీ తెలిసిందే. నిత్యం లక్షలాది మంది వినియోగదారులు ఈ ట్విట్టర్ ని వినియోగిస్తూనే ఉన్నారు. కాగా ఈ ట్విట్టర్ యాప్ ని టెస్లా కంపెనీ అధినేత ఎలాంటి మస్క్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ట్విట్టర్ కు సంబంధించిన ఏదో ఒక సంచలన ప్రకటన చేస్తూ వినియోగదారులకు షాకిస్తూనే ఉన్నాడు. కాగా ఎలాన్‌ మస్క్‌ ఎంతోమంది ట్విట్టర్ ఉద్యోగులను ఉద్యోగంలో నుంచి తొలగించిన విషయం తెలిసిందే.

ఈ సంగతి పక్కన పెడితే ఎలాన్‌ మస్క్‌కి మాజీ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ సహా తొలగించబడిన మాజీ ఎగ్జిక్యూటివ్‌లు భారీ ఝలక్‌ ఇచ్చారు. 10 లక్షల డాలర్లు పరిహారం చెల్లించాలంటూ మస్క్‌ నేతృత్వం లోని ట్విటర్‌ పై దావా వేశారు. అమెరికా లోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ వ్యాజ్యాలు, ప్రభుత్వ విచారణలకు సంబంధించిన చట్టపరమైన ఖర్చులను చెల్లించాల్సిందిగా డిమాండ్‌ చేశారు మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్ అలాగే ఎగ్జిక్యూటివ్ లు. భారత సంతతికి చెందిన ట్విటర్‌ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్, మాజీ లీగల్ హెడ్ విజయ గద్దె, మాజీ సీఎఫ్‌వో సెగల్ ముగ్గురూ చట్టపరంగా తమకు రావాల్సిన చెల్లింపులు చెల్లించాలి అంటూ కోర్టు కెక్కారు.

ఈ మేరకు అమెరికాలోని డెలావేర్ ఛాన్సరీ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ పలు ధపాల విచారణలో భాగంగా తామె వెచ్చించిన లీగల్ ఫీజులకు గాను ట్విటటర్ తమకు ఒక మిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉందని ముగ్గురూ ఆరోపించారు. కాగా గత ఏడాది అక్టోబర్‌లో మస్క్‌ ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత భారీ ఖర్చు తగ్గించే చర్చల్లో భాగంగా పలుక కీలక మార్పులను చేపట్టిన మస్క్‌ ప్రధానం అప్పటి సీఈవో పరాగ్‌ అగర్వాల్, గద్దె, సెగల్‌కు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. దీంతో ఎలాన్‌ మస్క్‌ కి రివర్స్ లో ఘలక్ తాజాగా వీరు ముగ్గురు కోర్టు మెట్లు ఎక్కారు.