Site icon HashtagU Telugu

Actor Passed Away: టాలీవుడ్ లో మరో విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత కన్నుమూత

Actor Passed Away

Resizeimagesize (1280 X 720) (2)

సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన స్వగృహంలో ఆదివారం ఉదయం తుదిశ్వాస (Passed Away) విడిచారు. దీంతో ఆయనకు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కాస్ట్యూమ్ కృష్ణ విజయనగరం జిల్లా, లక్కవరపుకోటలో జన్మించారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. జగపతి బాబు హీరోగా నటించిన పెళ్లి పందిరి చిత్రానికి నిర్మాతగా ఉన్నారు. అందులో నటుడిగా కూడా పని చేశారు. దీంతో పాటు అనేక చిత్రాల్లో విలన్‌గా, సహాయ పాత్రల్లో నటించి మెప్పించారు.

కాస్ట్యూమ్స్ కృష్ణ 1954లో మద్రాస్ వెళ్లి అసిస్టెంట్ కాస్ట్యూమర్‌గా జాయిన్ అయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి,వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి నటులకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారు. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన అశ్వద్దామ సినిమాతో తొలిసారి నిర్మాత అయ్యారు. ఆర్వాత పెళ్ళాం చెపితే వినాలి, మా ఊరు మారదు, పుట్టింటికి రా చెల్లి, పెళ్లి పందిరి సినిమాలు తీశారు.

Also Read: Nepal President: నేపాల్‌ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ కి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

తక్కువ సినిమాల్లో నటించినా.. మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. కన్నింగ్ పాత్రలు, విలన్ పాత్రలు, కామెడీతో పాటు పిసినారి పాత్రలు చేయడంలో ఆయన దిట్ట. ఆరోగ్యం సహకరించకపోవడం, సినిమాల మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో పాటు.. పలువురు ఇండస్ట్రీ వాళ్ల చేతుల్లో ఆయన మోసపోయినట్టు గతంలో ఇంటర్వ్యూలో వెల్లడించారు. నటుడిగా, నిర్మాతగా సక్సెస్‌గా దూసుకెళ్తున్న కాస్ట్యూమ్స్ కృష్ణ కెరీర్‌లో పెళ్లి పందిరి సినిమాతో ఊహించని దెబ్బ తగిలింది. పబ్లిసిటీ కోసం రూ. 2 లక్షలు అప్పుగా ఇస్తున్నట్టు ఒక కాగితంలో, సినిమా నెగిటివ్ రైట్స్ కొన్నట్లుగా మరో కాగితంపై బయర్లు సంతకాలు చేయించుకున్నారు. ఈ విషయం తెలియని ఆయన సంతకం పెట్టడంతో మోసపోయాడు. ఆ దెబ్బతో సినిమాల మీద విరక్తితో ఇండస్ట్రీకి దూరమయ్యారు. కాస్ట్యూమ్స్ కృష్ణ మరణంతో టాలీవుడ్ లో విషాదం అలముకుంది. పలువురు సీనీ పెద్దలు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు.