తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుండి ఎంతో చైతన్యవంతంగా యువ నాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి పుష్పరాజు తాడికొండ నియోజకవర్గం నుండి రెండు సార్లు గెలుపొంది రెండుసార్లు మంత్రి పదవిని చేపట్టారు. ఉన్నత విద్యావంతులైన పుష్పరాజు నీతికి, నిజాయితీకి మారుపేరుగా నిలవడమే కాకుండా.. మచ్చలేని నాయకునిగా తన రాజకీయాన్ని ప్రస్థానాన్ని నేటితో తన తనువు చాలించి ముగించారు.
గుంటూరు జిల్లాలో కీలక నేతగా… తాడికొండ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఉమ్మడి ఏపిలో దివంగత NTR, చంద్రబాబు కేబినెట్ లలో మంత్రిగా పనిచేసిన జే.ఆర్ పుష్పరాజ్ అనారోగ్య కారణాలతో కొద్దిసేపటి క్రితం గుంటూరు లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల టీడీపీ నాయకులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.