Ramoji Rao: పాత్రికేయ శిఖరం రామోజీరావుకు అక్షరాంజలి

  • Written By:
  • Updated On - June 16, 2024 / 09:44 PM IST

Ramoji Rao: తెలుగు జర్నలిజానికి జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కృషీవలుడు రామోజీరావు అని పత్రికల సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు కొనియాడారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ‘పాత్రికేయ శిఖరం రామోజీరావుకు అక్షరాంజలి’ పేరుతో సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస రెడ్డి, ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షులు అల్లం నారాయణ, ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ మానుకొండ నాగేశ్వర రావు,

ఈనాడు తెలంగాణ ఎడిటర్ డీఎన్ ప్రసాద్ , కార్టునిస్ట్ శ్రీధర్, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, వల్లీశ్వర్, పీఎస్ఆర్ సీ మూర్తి, కందుల రమేష్, ఆల్ ఇండియా రేడియో డిప్యుటీ డైరెక్టర్ జయపాల్ రెడ్డి, ఎన్టీవీ చీఫ్ ఎడిటర్ వై.ఎస్.ఆర్.శాస్త్రి, ఏపీ తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు సహా పలువురు సీనియర్ జర్నలిస్ట్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జర్నలిస్టులు… రామోజీరావుతో తమకున్న స్మృతుల్ని స్మరించుకున్నారు. జర్నలిజంతో పాటు సినీవ్యాపార రంగాల్లో ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.