సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. సీనియర్ దర్శకుడు సాగర్ (Senior Director Sagar) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. అమ్మదొంగ, స్టూవర్టుపురం దొంగలు వంటి హిట్ సినిమాలకు సాగర్ దర్శకత్వం వహించారు. మూడుసార్లు తెలుగు సినిమా దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన మరణంపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Hyderabad: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం
సాగర్ పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. సాగర్ డైరెక్ట్ చేసిన రామసక్కనోడు సినిమాకు మూడు నంది పురస్కారాలు లభించాయి. టాలీవుడ్ లో దాదాపు 30 సినిమాలను డైరెక్ట్ చేశారు సాగర్. అంతేకాకండా ఈయన తెలుగు సినిమా దర్శకులు సంఘానికి మూడు సార్లు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. సాగర్ మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.