కేరళకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మూడుసార్లు మంత్రిగా పనిచేసిన ఆర్యదన్ మహమ్మద్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కేరళ కాంగ్రెస్ రాజకీయాలలో ఆర్యదన్ చాణుక్కుడిగా పేరుగాంచారు. ఆయన మంత్రిగా ఎ.కె. ఆంటోనీ, ఊమెన్ చాందీ ప్రభుత్వంలో పని చేశారు. ఆర్యదాన్ ఆంటోనీ ప్రభుత్వంలో పర్యాటక, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఊమెన్ చాందీ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పని చేశారు. సోమవారం నిలంబూరులో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. 1970 నుండి నిలంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, అతను కాంగ్రెస్ టిక్కెట్‌పై 2016 వరకు కేరళ శాసనసభ సభ్యుడుగా ఉన్నారు.
Kerala Ex-Minister Aryadan : కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్యదన్ మహమ్మద్ కన్నుమూత

Kerala Ex Minister Imresizer