Site icon HashtagU Telugu

Jamuna: బ్రేకింగ్.. సీనియర్ నటి జమున కన్నుమూత

Jamuna

Januma

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటి జమున ( Actress Jamuna) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆమె మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఫిలిం చాంబర్‌కు ఆమె భౌతిక కాయాన్ని తరలించనున్నారు. తెలుగు చిత్రసీమలో ఎక్కువ కాలం నటించిన ఘనతను జమున సొంతం చేసుకున్నారు.

Also Read: America: ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే విషాదం.. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

ఆమె కర్నాటకలోని హంపిలో 30 ఆగస్టు 1936 జన్మించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో పెరిగారు. హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ జూలూరి రమణరావును వివాహం చేసుకున్నారు. వీరికి వంశీ, స్రవంతి సంతానం. వంశీ మీడియా ప్రొఫెసర్‌గా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో పనిచేస్తున్నారు.

తెలుగు, దక్షిణభారత భాషల్లో కలిపి ఆమె 198 సినిమాలు చేశారు. పలు హిందీ సినిమాలలో కూడా నటించారు. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది. తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ నెలకొల్పి 25సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారామె. 1980లలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్ సభకు ఎంపిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజకీయల నుండి తప్పుకున్నారు.