Site icon HashtagU Telugu

BJP MLA Fire: పోలీసుల ఎదుటే శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు

BJP MLA Fire

Safeimagekit Resized Img (1) 11zon

BJP MLA Fire: మహారాష్ట్రలోని థానే జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి పోలీసు స్టేషన్‌లో కాల్పులు (BJP MLA Fire) జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు గాయపడగా వారిని ఆసుపత్రిలో చేర్చారు. బీజేపీ ఎమ్మెల్యే, శివసేన (షిండే) వర్గానికి చెందిన నాయకుడి మధ్య ఘర్షణ జరగడంతో ఉల్హాస్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

శివసేన (షిండే) పక్షనేత మహేశ్ గైక్వాడ్, బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ మధ్య ఏదో అంశంపై విభేదాలు ఉన్నాయని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చారని డీసీపీ సుధాకర్ పఠారే చెబుతున్నారు. అదే సమయంలో వారి మధ్య కొంత చర్చ జరుగుతోంది. అకస్మాత్తుగా గణపత్ గైక్వాడ్.. మహేష్ గైక్వాడ్, అతని వ్యక్తులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడగా వారిని వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విష‌యంపై విచారణ జరుగుతోంది.

Also Read: India vs Pakistan : ఇండియా వర్సెస్ పాక్.. 60ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై అమీతుమీ

శివసేన నేత విమ‌ర్శ‌లు

ఉల్లాస్‌నగర్‌ కాల్పుల ఘటనపై శివసేన (యూబీటీ) నేత ఆనంద్‌ దుబే ప్రశ్నలు సంధించారు. ఈ కాల్పులు పోలీస్ స్టేషన్‌లోనే జరిగాయని, కాల్పులు జరిపిన వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ అని, కాల్పులకు గురైన‌ వ్యక్తి శివసేన (షిండే) పక్ష నేత మహేశ్ గైక్వాడ్ అని చెప్పారు. మహారాష్ట్రను జంగిల్ రాజ్‌గా మారుస్తున్నారని ఆయ‌న అన్నారు.

We’re now on WhatsApp : Click to Join

లక్షలాది ప్రజల సంక్షేమం కోసం పాటుపడాల్సిన ఎమ్మెల్యే ప్రజలను కాల్చిచంపడం ఎంత దురదృష్టకరమని ఆనంద్ దూబే అన్నారు. 3 ఇంజిన్ల ప్రభుత్వంలో రెండు పార్టీల నాయకులు ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక కోణంలో రెండు ఇంజిన్లు విఫలమవుతున్నాయి. మన రాష్ట్రం ఏ దిశగా పయనిస్తోంది? ఇది జంగిల్ రాజ్ లాంటిది కాదా? అని విమ‌ర్శ‌లు కురిపించారు.

Exit mobile version