Site icon HashtagU Telugu

Seethakka Demands: ‘జీయర్’ బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలి!

Seetakka

Seetakka

ప్రముఖ సమ్మక్క సారలమ్మ జాతరపై చిన జీయర్ స్వామి వ్యాఖ్యలను కాంగ్రెస్ ములుగు ఎమ్మెల్యే సీతక్క ఖండిస్తూ గిరిజనులకు, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గిరిజన దేవతలైన సమ్మక్క, సారలమ్మపై ఎందుకు ఈ అహంకారపూరిత మాటలు అని సీతక్క ప్రశ్నించింది. సమ్మక్క సారలమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి, పోరాటానికి ప్రతీక అని ఆమె అన్నారు. మేడారంలోని సమ్మక్క సారలమ్మ వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగడం లేదని,  సమ్మక్క, సారలమ్మ దర్శనానికి ఒక్క రూపాయి కూడా వసూలు చేయడం లేదని ఆమె తెలిపారు. జీయర్ స్వామి ….స‌మ‌తా మూర్తి  120 కిలోల బంగారు విగ్రహాన్ని చూసేందుకు టిక్కెట్టుగా రూ.150 వసూలు చేశారని ఆమె విమర్శించారు. తక్షణమే జీయర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చిన జీయర్ స్వామి వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించాలని ఆమె కోరారు.