Site icon HashtagU Telugu

Seethakka : కేటీఆర్‌ జైలుకు వెళ్లాలని కుతూహలంగా ఉన్నారు

Minister Seethakka

Minister Seethakka

Seethakka : తెలంగాణ మంత్రి సీతక్క, సోమవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర రాజకీయాలను కదిలించే వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఆమె చేసిన వ్యాఖ్యలు, బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌పై చేసిన విమర్శలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సీతక్క మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు. నాలుగు నుంచి ఐదు రోజుల్లో పూర్తి సమాచారం బయటపడుతుందని వెల్లడించారు. “ఇప్పటివరకు ఎన్నికలపై అధికారిక నోటిఫికేషన్ ఏదీ వెలువడలేదు. నేను కూడా ఎటువంటి తప్పుడు ప్రకటన ఇవ్వలేదు. నా మాటల్లో ఎలాంటి మార్పు లేదు” అని స్పష్టం చేశారు.

Census : ‘జన గణన’కు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన హోంశాఖ

పార్టీ శ్రేణులతో చర్చించి, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కలిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదే సమావేశంలో సీతక్క మరోసారి బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌పై సెటైరిక్ వ్యాఖ్యలు చేశారు. “కవిత జైలుకు వెళ్లి వచ్చి బీసీ ఎజెండాను ఎత్తుకున్నది. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే దారిలో నడవాలనుకుంటున్నాడు. ఆయన జైలుకు పోవాలని ఆశగా ఎదురు చూస్తున్నవారు ఉన్నారు. పొగరు చూపుతూ మాట్లాడుతున్న కేటీఆర్‌ను మా సీఎం వీలైనంత త్వరగా జైలుకు పంపాలని చూస్తున్నారు” అంటూ వాఖ్యానించారు. కేటీఆర్, కవిత మధ్య రాజకీయ పోటీ ఉందని వ్యాఖ్యానించిన ఆమె, ప్రస్తుతం తన వ్యాఖ్యలతో రాజకీయ వేడి పెంచారు.

Israel: ఇరాన్‌ క్షిపణి దాడి..స్వల్పంగా దెబ్బతిన అమెరికా దౌత్య కార్యాలయం..!