AP : మంత్రి అప్పలరాజు వల్ల జగన్ కు కొత్త సమస్య ఎదురుకాబోతుందా..?

మన ఓట్లు అయితే ఓకే .. కానీ మనకు పడవు అనుకుంటే మాత్రమే

  • Written By:
  • Publish Date - August 4, 2023 / 02:12 PM IST

మన ఓట్లు అయితే ఓకే .. కానీ మనకు పడవు అనుకుంటే మాత్రమే ఆ ఓటర్ల ఫై ఫార్మ్ 7 లో ఫిర్యాదు చేయండి అంటూ మంత్రి అప్పలరాజు (Seediri Appalaraju) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో దుమారం రేపుతున్నాయి.

సొంత పార్టీ మంత్రుల వల్ల సీఎం జగన్ (CM Jagan) తరుచు వివాదాల్లో నిలుస్తున్నారు. ఎదురుగా మైక్ ఉందికదా అని ఏదిపడితే ఆలా మాట్లాడుతూ కొంతమంది మంత్రులు రెచ్చిపోతున్నారు. దీనివల్ల పార్టీ డ్యామేజ్ అవుతుంది. జగన్ ముందు ఏదో చేయబోయే..జనాల దగ్గర ఛీ కొట్టించుకుంటున్నారు. ఇప్పటివరకు చాలామంది అలాగే నోరు జారీ జగన్ పరువు తీశారు. తాజాగా మంత్రి అప్పలరాజు వల్ల జగన్ కు కొత్త సమస్య రాబోతున్నట్లు తెలుస్తుంది.

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. అది పబ్లిక్ మీటింగ్ లోనైన..ప్రవైట్ సమావేశంలోనైనా..ఎందుకంటే గతంలోలా కాదు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి..ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అకౌంట్ ఉంటుంది. ఏ చిన్న తప్పు చేసిన..ఎక్కడ నోరు జారిన క్షణాల్లో దానిని సోషల్ మీడియా లో పోస్ట్ చేసి ఓ ఆటాడేసుకుంటున్నారు. ప్రజలు సైతం అన్ని గమనిస్తున్నారు..మన పార్టీ వాడే కదా అన్నది అనుకోవడం లేదు..మనోడైనా …పక్కోడైన తప్పు తప్పే అంటూ నిలదీస్తున్నారు.

తాజాగా శ్రీకాకుళం జిల్లా మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈయన పార్టీ (YCP) కార్యకర్తలతో మాట్లాడుతూ … మన ఓట్లు అయితే ఓకే .. కానీ మనకు పడవు అనుకుంటే మాత్రమే ఆ ఓటర్ల ఫై ఫార్మ్ 7 లో ఫిర్యాదు చేయండి అంటూ మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ వ్యాఖ్యల సారాంశం వైసీపీ ఓటర్లు అయితే ఉంచండి, టీడీపీ లేదా ఇతర పార్టీల ఓటర్లు అయితే అభ్యంతరం చేయండి అంటూ చెప్పినట్లు. మరి ఈ వ్యాఖ్యలు అప్పలరాజే అన్నారా..లేక మార్ఫెడ్ వీడియోనా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యల వీడియో వైరల్ గా మారడం తో దీనిపై ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసేందుకు జనసేన సిద్ధం అవుతుంది.

ఇప్పటికే రాష్ట్రంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతూ ఎన్నికల సంఘానికి పిర్యాదు చేయగా..ప్రస్తుతం ఎన్నికల అధికారులు సర్వే చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు జగన్ కు మరో తలనొప్పి తెచ్చేలా ఉందని అంత అంటున్నారు.

Read Also : AB de Villiers: ఆర్సీబీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్న ఏబీ డివిలియర్స్‌.. ఈసారి ఆ పాత్రలో మిస్టర్ 360..?