Atheletes: ప్రపంచ కుబేరులు జిమ్‌లో ఎలా వర్కౌట్లు చేస్తున్నారో చూడండి

ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. టెక్నాలజీ ప్రపంచం ఇప్పుడు ఏఐ హవా కొనసాగుతోంది. ఏఐ ద్వారా ప్రతీ పని సులువు అవుతుంది. ఈజీగా పని అవ్వడంతో పాటు ప్రొడక్టవిటీ కూడా పెరుగుతోంది.

  • Written By:
  • Publish Date - May 8, 2023 / 08:07 PM IST

Atheletes: ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. టెక్నాలజీ ప్రపంచం ఇప్పుడు ఏఐ హవా కొనసాగుతోంది. ఏఐ ద్వారా ప్రతీ పని సులువు అవుతుంది. ఈజీగా పని అవ్వడంతో పాటు ప్రొడక్టవిటీ కూడా పెరుగుతోంది. దీంతో కంపెనీలన్నీ ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మనిషి చేసే పనులతో పాటు మనిషి ఆలోచన ఎలా ఉంటుందో.. అలానే ఏఐ కూడా పనిచేస్తుంది.

ఇప్పుడే ఏఐ ద్వారా ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు జిమ్‌లో వర్కౌట్లు చేసే ఎలా ఉంటుందనే దానిపై చేసిన ఫొటో సోషల్ మీడియాలో చ్కకర్లు కొడుతోంది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్, టాటా సంస్థ చైర్మన్ రతన్ టాటా, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ జిమ్‌లో వర్కౌట్లు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై ఏఐ ద్వారా ఫొటోలు క్రియేట్ చేవారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాహిద్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ ఫొటోలను తన అకౌంట్ లో షేర్ చేశాడు.

అలాగే ప్రపంచ బిలియనీర్లు జెఫ్ బెజోస్, బెర్నార్డ్ అల్నార్ట్, వారెన్ బఫెట్ వర్కౌట్ ఫొటోలను కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించారు. ఈ ఫొటోలకు ఇప్పివరు వెయ్యి కంటే ఎక్కువ లైకులు రాగా.. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. మనీ+మజిల్=పవర్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఏఐ ద్వారా మనం దేనినైనా ఊహించుకోవచ్చు. మనిషి భవిష్యత్తులో ఎలా ఉన్నాడు.. గతంలో ఉలా ఉన్నాడు అనే దానిని ఊహిస్తుంది.

సెలబ్రెటీల భవిష్యత్తు, గతం, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అనే ఫొటోలను ఏఐ ద్వారా రూపొందిస్తున్నారు. గతంలో మహేంద్రసింగ్ ధోని, నరేంద్ర మోదీ ఫొటోలను ఏఐ ద్వారా క్రియేట్ చేశారు. సాహిద్ అనే ఈ యూజర్ కు ఏఐ మీద అవగాహన ఉన్నట్లు తెలుస్తోంది.