Site icon HashtagU Telugu

TTD : శ్రీవారి ఆల‌యంలో మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డ భ‌ద్ర‌తావైఫ‌ల్యం..మాఢ వీధుల్లో..?

Tirumala Ttd

Tirumala Ttd

తిరుమ‌ల శ్రీవారి ఆల‌యంలో భ‌ద్ర‌తా వైఫ‌ల్యం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. శ్రీవారి ఆల‌య మాఢ‌వీధుల్లో ఇన్నోవా కార్ చ‌క్క‌ర్లు కొట్టింది. సీఎంవో స్టికర్ కలిగి ఉన్న వాహనం ఆలయ మాడ వీధుల్లో హ‌ల్‌చల్ చేసింది. టీటీడీ నిబంధనలను అతిక్రమించి శ్రీవారి ఆలయ మాడవీదిలోకి ఇన్నోవా వాహ‌నం ప్ర‌వేశించింది. అక్క‌డి పోలీసులు కారు డ్రైవ‌ర్‌ని ప్ర‌శ్నించ‌గా..కారు యూ టర్న్ చేసుకోవడం కోసమే వచ్చానని డ్రైవ‌ర్ తెలిపాడు. వాస్త‌వంగా మాడ వీధుల్లో శ్రీ వారి రథాలు మాత్రమే ఊరేగుతుంటాయని అలాంటి మాఢ‌వీధుల్లో సీఎంవో స్టిక్క‌ర్ క‌లిగిన కారు తిర‌గ‌డం అంటే భ‌ద్ర‌తా వైఫ‌ల్య‌మేన‌ని భ‌క్తులు ఆరోపిస్తున్నారు.