Site icon HashtagU Telugu

AP Goverment : రెండో శ‌నివారం సెల‌వు ర‌ద్దు చేసిన ఏపీ ప్ర‌భుత్వం

Cm Jagan

Cm Jagan

ఏపీలో ఎల్లుండి రెండో శనివారం సెలవును ప్ర‌భుత్వం రద్దు చేసింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో వివిధ కార్యక్రమాలు జ‌రగ‌నున్నాయి. ఆగస్టు 15వ తేది వరకూ స్కూళ్లలో డ్యాన్స్, మ్యూజిక్, ర్యాలీలు, పెయింటింగ్ వంటి కార్య‌క్ర‌మాల‌తో పాటు జాతీయ జెండాలతో సెల్పీలు దిగి అప్లోడ్ చేసే కార్యక్రమాలు ఉంటాయి. అందువల్ల ఆగస్టు 13న సెలవును రద్దు చేస్తూ విద్యాశాఖ జీవో జారీ చేసింది. ఆ రోజును వర్కింగ్ డేగా నిర్ణయించింది. ఇప్ప‌టికే ఏపీ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ప్ర‌తి గ్రామంలో ఇళ్ల‌పై జాతీయ జెండాలు ఎగ‌ర‌వేస్తున్నారు.