Manipur Election 2022: మణిపూర్‌లో ప్రారంభమైన రెండో ద‌శ‌ పోలింగ్..!

ఇండియాలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో ఈరోజు మ‌ణిపూర్‌లో రెండో విడ‌త పోలింగ్ ప్రారంభ‌మ‌యింది. దీంతో మ‌ణిపూర్‌లో నేడు జ‌రిగే రెండో ద‌శ పోలింగ్‌లో అక్క‌డ అన్ని నియోజక‌వ‌ర్గాల్లో పోలింగ్ ముగియ‌నున్నాయి. ఇక మ‌ణిపూర్‌లో రెండో విడ‌త పోలింగ్ మొత్తం 6జిల్లాల్లోని 22 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈరోజు పోలింగ్ జ‌రుగ‌నుంది. ఈ క్ర‌మంలో మొత్తం 92 మంది అభ్య‌ర్థ‌లు ఈరోజు ఎన్నిక‌ల బ‌రిలో పోటీ ప‌డ‌నున్నారు. ఇక ఈరోజు పోలింగ్‌లో భాగంగా మ‌ణిపూర్‌లో 8.38 లక్షల […]

Published By: HashtagU Telugu Desk
Manipur Election 2022

Manipur Election 2022

ఇండియాలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో ఈరోజు మ‌ణిపూర్‌లో రెండో విడ‌త పోలింగ్ ప్రారంభ‌మ‌యింది. దీంతో మ‌ణిపూర్‌లో నేడు జ‌రిగే రెండో ద‌శ పోలింగ్‌లో అక్క‌డ అన్ని నియోజక‌వ‌ర్గాల్లో పోలింగ్ ముగియ‌నున్నాయి. ఇక మ‌ణిపూర్‌లో రెండో విడ‌త పోలింగ్ మొత్తం 6జిల్లాల్లోని 22 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈరోజు పోలింగ్ జ‌రుగ‌నుంది. ఈ క్ర‌మంలో మొత్తం 92 మంది అభ్య‌ర్థ‌లు ఈరోజు ఎన్నిక‌ల బ‌రిలో పోటీ ప‌డ‌నున్నారు. ఇక ఈరోజు పోలింగ్‌లో భాగంగా మ‌ణిపూర్‌లో 8.38 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఈ క్ర‌మంలో అక్క‌డ‌ ఉదయమే పోలింగ్ ప్రారంభం కావడంతో, ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరారు. రెండో విడ‌త పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే జరుగుతుంది. దీంతో 1,247 పోలింగ్ కేంద్రాలను అక్క‌డి ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రంలో మొత్తం 60 నియోజకవర్గాలు ఉండ‌గా మొదటి దశలో 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించారు. వీటిలో 12 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈరోజు రెండో దశలో 22 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. ఇక‌పోతే ఈ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి.

  Last Updated: 05 Mar 2022, 09:17 AM IST