కేరళలో రెండవ మంకీపాక్స్ కేసు నమోదైందని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు రెండు కేసులు కేరళలోనే నమోదైయ్యాయి. దు బాయ్ నుంచి వచ్చి కన్నూర్‌లోని పరియారం మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 31 ఏళ్ల వ్యక్తికి వ్యాధి పాజిటివ్‌గా తేలిందని ఆమె తెలిపారు.రోగి పరిస్థితి బాగానే ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని జార్జ్ తెలిపారు. అతనితో సన్నిహితంగా ఉన్న వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచారు. యుఎఇ నుండి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ పరీక్షించిన తర్వాత దేశంలోని మొదటి కేసు జూలై 14 న రాష్ట్రంలోని కొల్లాంలో నమోదైంది.
Monkeypox : కేరళలో రెండవ మంకీపాక్స్ కేసు నమోదు

Monkey Pox