Site icon HashtagU Telugu

Tirumala:ఈ నెల 11న తిరుమ‌ల రెండ‌వ ఘాట్ రోడ్డు పునఃప్రారంభం

Tirumala Ghat Road

Tirumala Ghat Road

తిరుమ‌ల రెండ‌వ ఘాట్ రోడ్డు మ‌ర‌మ్మ‌త్తులు ప‌నులు పూర్తి కావొచ్చాయి. జ‌న‌వ‌రి 11వ తేదీ రాత్రి నుంచి ఈ ఘాట్ రోడ్ పై వాహ‌నాల రాక‌పోక‌ల‌ను అనుమ‌తి ఇస్తామ‌ని టీటీడీ ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం యాత్రికుల రాకను దృష్టిలో ఉంచుకుని ఈ ఘాట్ రోడ్డును పునఃప్రారంభిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. తిరుమ‌ల‌లో దెబ్బతిన్న రోడ్డు మరమ్మతు పనులను టీటీడీ యుద్ధప్రాతిపదికన చేపట్టి నెల రోజుల్లో పూర్తి చేసింది. దెబ్బతిన్న ఘాట్ రోడ్డు పునరుద్ధరణపై నిపుణుల అభిప్రాయాన్ని సేకరించేందుకు టీటీడీ ఐఐటీ, న్యూఢిల్లీ, చెన్నై, అమృత విశ్వ విద్యాపీఠం, కొల్లం, కేరళ నుంచి నిపుణులను తీసుకొచ్చారు. రెండో ఘాట్‌ రోడ్డులో జరుగుతున్న నిర్మాణ‌ పనులను ఆదివారం టీటీడీ చైర్మన్‌ పరిశీలించారు. ఘాట్‌ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టిన ఏఎఫ్‌కాన్‌ ఇంజనీర్ల బృందంతో ఆయన మాట్లాడి జనవరి 11 రాత్రిలోగా పనులు పూర్తి చేసి యాత్రికులకు రోడ్డు వినియోగంలోకి వచ్చేలా చూడాలన్నారు. డిసెంబరు 1న తిరుపతి-తిరుమల రెండు చోట్ల కురిసిన భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్డులో పలుచోట్ల భారీ బండరాళ్లు రోడ్డుపై పడడంతో పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో తిరుమలకు వెళ్లే అప్ ఘాట్ రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో ఈ ఘాట్ రోడ్డు ను టీటీడీ అధికారులు మూసివేసి ప‌నులు ప్రారంభించారు.