Site icon HashtagU Telugu

Dowleswaram Project : ధ‌వ‌ళేశ్వ‌రం ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వ‌ర‌ద‌.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Dowleswaram barrage

Dowleswaram barrage

ధ‌వ‌ళేశ్వ‌రం ప్రాజెక్టుకు భారీగా వ‌ర‌ద నీరు చేరుతుంది. దీంతో బ్యారేజీ వ‌ద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రాజెక్టు వద్ద 13.4 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో కొనసాగుతోంది. ముంపునకు గురయ్యే తీర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. లంక గ్రామాల్లోకి నీరు రావడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా పి.గన్నవరం మండలంలోని చాకలిపాలెం, కనకాయలంక తదితర గ్రామాలు వర్షపు నీటితో నిండిపోయాయి. మ‌రోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది.. ఫలితంగా రిజర్వాయర్ తొమ్మిది గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2,69,288 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,14,034 క్యూసెక్కులుగా ఉంది.