Site icon HashtagU Telugu

Trains Cancelled : ఈ నెల 31 వరకు 55 ప్యాసింజర్ రైళ్లు రద్దు

Trains

Trains

దేశంలో రోజు రోజుకు కరోనా ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. ఒమిక్రాన్ వేరియంట్‌ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ఈ నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఆంక్ష‌ల‌ను క‌ఠిన‌త‌రం చేస్తున్నాయి. ఇటు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే కూడా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇటీవ‌ల ప్రకటించింది. కాగా 55 రైళ్ల రద్దును ఈనెల 31 వరకు పొడిగించినట్లు వెల్లడించింది.
రద్దు చేసిన ప్రధాన రైళ్లు ఇవే..

1). కాజీపేట – సికింద్రాబాద్, కాచిగూడ – నడికుడ ప్యాసింజర్‌ రైళ్లు రద్దు..

2). కాచిగూడ – కర్నూల్ సిటీ, మేడ్చల్‌ – ఉందానగర్ రైళ్లు రద్దు..

3). మేడ్చల్ – సికింద్రాబాద్, సికింద్రాబాద్ – ఉందానగర్ రైళ్లు రద్దు..

4). తిరుపతి – కట్‌పడి, గుంతకల్ – డోన్, కర్నూల్ సిటీ – గుంతకల్లు రైళ్లు రద్దు..

5). రేపల్లె – తెనాలి, విజయవాడ – నర్సాపూర్ ప్యాసింజర్‌ రైళ్లు రద్దు..

6). మచిలీపట్నం – విజయవాడ, మచిలీపట్నం – గుడివాడ రైళ్లు రద్దు..

7). నర్సాపూర్ – నిడుదవోలు ప్యాసింజర్ రైలు రద్దు..

ఎంఎంటీఎస్‌లు రైళ్లు కూడా ఈ నెల 23 వరకూ 38 సర్వీసులను రద్దు చేసింది. మొత్తం 36 సర్వీసులను నిలిపేసినట్లు ప్రకటించింది. ఇందులో హైదరాబాద్‌ – లింగంపల్లి మధ్య నడిచే 18, ఫలక్‌నుమా – లింగంపల్లి మధ్య నడిచే 16, సికింద్రాబాద్‌ – లింగంపల్లి మధ్య నడిచే రెండు ఎంఎంటీఎస్‌లు ఉన్నాయి.

Exit mobile version