Worlds Ugliest Dog : ఆ కుక్క రూ. 1.22 లక్షలు గెల్చుకుంది..
“వరల్డ్స్ అగ్లీయెస్ట్ డాగ్” కాంటెస్ట్‌లో స్కూటర్ అనే పేరు కలిగిన కుక్క విజయ ఢంకా మోగించింది..
“చైనీస్ క్రెస్టెడ్ డాగ్” జాతికి చెందిన ఈ ఏడేళ్ల కుక్క ప్రపంచంలో తానే వికృతమైన కుక్కను అని నిరూపించుకుంది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న పెటలుమా ఏరియాలో సోనోమా-మారిన్ ఫెయిర్ జరిగింది. 50 ఏళ్లుగా ఈ డాగ్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. వికృతంగా కనిపించే కుక్కలను వాటి యజమానులు తీసుకొచ్చి ఈ ఈవెంట్ లో ప్రదర్శించారు. ఈ పోటీలో ఎన్నో వికృతమైన కుక్కలు పాల్గొన్నాయి. కానీ వాటన్నింటితో పోటీపడి స్కూటర్ అనే కుక్క గెలిచింది. ఈ డాగ్ కు ఒక బాధాకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది. వెనుక కాళ్లలోని కీళ్లు రివర్స్ అయిన స్థితిలో స్కూటర్ పుట్టింది. దీంతో అది నడవడం కష్టతరంగా మారింది. ఇతర కుక్కల్లా తిరగలేని పరిస్థితి వచ్చింది. దీంతో దాని పెంపకందారుడు స్కూటర్ ను జంతువుల పరిరక్షణ కేంద్రంలో వదిలేద్దామని అనుకున్నాడు.
Also read : Etela Jamuna: ఈటల హత్యకు కౌశిక్ రెడ్డి కుట్ర.. ఈటల జమున సంచలన ఆరోపణలు!
ఈక్రమంలో జంతు ప్రేమికురాలు ఎల్మ్‌క్విస్ట్ వెళ్లి.. స్కూటర్ యజమానిని కలిసింది. స్కూటర్ పెంపకంలో తాను హెల్ప్ చేస్తానని, గైడెన్స్ ఇస్తానని చెప్పింది. ఎల్మ్‌క్విస్ట్ తరుచూ వెళ్ళి స్కూటర్ బాగోగులు చూసి వచ్చేది. ట్రీట్మెంట్ కు సంబంధించిన సలహాలు ఇచ్చేది. మునుపటి యజమాని స్కూటర్‌ని పట్టించుకోలేని స్థితి ఏర్పడిన టైంలో .. ఎల్మ్‌క్విస్ట్ వెళ్లి స్కూటర్ ను తన ఇంటికి తీసుకొచ్చింది. గత ఏడు నెలలుగా ఎల్మ్‌క్విస్ట్ ఇంట్లోనే స్కూటర్ ఉంటున్నాడు. ఈ డాగ్ షోలో స్కూటర్ తన ముందు కాళ్లతో మెల్లగా నడిచి అందరితో చప్పట్లు కొట్టించాడు. వెనుక కాళ్ళు సపోర్ట్ చేయకున్నా .. ఉన్న ముందు కాళ్ళని స్కూటర్ నమ్ముకున్న తీరు న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంది. అందుకే దాని విన్నర్ గా(Worlds Ugliest Dog) ప్రకటించారు. తాను వికృతంగా ఉన్నా.. శరీరం అంతా బాధలు దహిస్తున్నా.. స్కూటర్ లో జీవితంపై ఆశాభావం రగులుతుండటం విశేషం.