SCO Summit : నేటి నుంచి పాకిస్థాన్‌లో SCO సదస్సు జరుగనుంది. ఈ నేపథ్యంలోనే ఇస్లామాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారను. అంతేకాకుండా.. భారీ ప్రదర్శనకు సిద్ధమవుతోంది ఇమ్రాన్ ఖాన్ పార్టీ. అయితే.. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈరోజు రెండు రోజుల పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనున్నారు. కాగా, రాజధాని ఇస్లామాబాద్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) దేశాల శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. భారతదేశం SCO సభ్య దేశం. ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్ ఆగస్టులో భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపింది. అయితే భారత్ నుంచి ప్రధాని కాకుండా విదేశాంగ మంత్రి ఈ సదస్సులో పాల్గొంటారు. జైశంకర్ అక్కడ 24 గంటల కంటే తక్కువ సమయం గడపనున్నారు. అంతకుముందు, జైశంకర్ తన పాకిస్తాన్ పర్యటన ఉద్దేశ్యం SCO సమావేశం కోసమేనని, రెండు దేశాల మధ్య సంబంధాలపై ఎటువంటి చర్చ జరగదని చెప్పారు. ఈ సదస్సులో భారత్‌తో పాటు రష్యా, చైనా సహా 8 దేశాల ప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, భద్రతను పటిష్టం చేయడానికి ఇస్లామాబాద్‌లో లాక్‌డౌన్ అమలు చేయబడింది. అలాగే నగరం మొత్తం 3 రోజుల పాటు సెలవు ప్రకటించారు.
Canada Vs India : కెనడా ‘ఉగ్ర’ రూపం.. భారత విమానం పేల్చేసిన ఖలిస్తానీలకూ షెల్టర్
9 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో పర్యటించనున్న భారత మంత్రి
విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ పర్యటన కూడా ప్రత్యేకం, ఎందుకంటే 9 ఏళ్లలో భారత మంత్రి పాకిస్థాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. గతంలో 2015లో ప్రధాని మోదీ పాకిస్థాన్‌లో పర్యటించారు. ఆ తర్వాత మోదీ ఆకస్మిక పర్యటనలో లాహోర్ చేరుకున్నారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో భేటీ అయ్యారు. ఆయన పర్యటన తర్వాత భారత ప్రధాని లేదా మంత్రులెవరూ పాకిస్థాన్‌లో పర్యటించలేదు. 2019లో జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఆ తర్వాత రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరగలేదు. అయితే, గతేడాది గోవాలో జరిగిన ఎస్‌సీవో దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు పాకిస్థాన్ అప్పటి విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో భారత్ వచ్చారు.
భారతదేశానికి SCO ఎందుకు ముఖ్యమైనది?
SCOలో భారతదేశం, చైనా, రష్యా, పాకిస్థాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్థాన్ , ఉజ్బెకిస్థాన్ ఉన్నాయి. ఈ సంస్థ మధ్య ఆసియాలో శాంతిని , అన్ని దేశాల మధ్య సహకారాన్ని కొనసాగించడానికి సృష్టించబడింది. పాకిస్తాన్, చైనా , రష్యా కూడా ఇందులో సభ్యులు. ఉగ్రవాద వ్యతిరేకత , భద్రతకు సంబంధించిన సమస్యలపై తన అభిప్రాయాలను బలంగా ప్రదర్శించడానికి భారతదేశానికి SCO ఒక బలమైన వేదికను అందిస్తుంది.