Site icon HashtagU Telugu

Octopus Nursery : ఇదిగో ఆక్టోపస్ ల నర్సరీ.. ఇండియన్ సైంటిస్ట్ అండ్ టీమ్ డిస్కవరీ

Octopus Nursery 

Octopus Nursery 

Octopus Nursery : సముద్ర గర్భంలో రీసెర్చ్ చేస్తున్న సముద్ర శాస్త్రవేత్తలు (marine scientists) మునుపెన్నడూ చూడని ఒక సీన్ ను చూశారు.. 

కోస్టారికా దేశ తీరంలో పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం నుంచి దాదాపు 2,800 మీటర్ల దిగువన  ఆక్టోపస్ ల పెద్ద  ఫ్యామిలీని గుర్తించారు.

అక్కడ ఆక్టోపస్ ల ఫ్యామిలీ నివసిస్తోందని స్టడీలో తేలింది.  

ఆక్టోపస్ తల్లులు ఆ ప్రదేశంలో  తమ గుడ్లను పెట్టి సంతానోత్పత్తి చేస్తున్నాయని వెల్లడైంది. 

లోతైన సముద్రంలో చల్లని ఉష్ణోగ్రతలు ఉంటాయి. అలాంటి వాతావరణాన్ని ఆక్టోపస్‌లు ఇష్టపడతాయి. కోస్టారికా తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో గుర్తించిన ఆక్టోపస్‌ నర్సరీలో(Octopus Nursery) తల్లి ఆక్టోపస్‌ లు బేబీ ఆక్టోపస్‌లను పొదుగుతున్నట్లు గుర్తించారు. ఇవి మ్యూసోక్టోపస్ జాతికి చెందినవని అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ష్మిత్ ఓషియన్ ఇన్ స్టిట్యూట్ (Schmidt Ocean Institute) శాస్త్రవేత్తలు  తెలిపారు.  ఇవి మీడియం సైజ్ సముద్రపు ఆక్టోపస్‌లు అని వెల్లడించారు.

ఈవిధంగా ఆక్టోపస్‌ నర్సరీలు ఉన్న ప్రాంతాలను సీమౌంట్‌లు అంటారు. సముద్ర గర్భంలో “డోరాడో అవుట్‌ క్రాప్” అనే రాతి నిర్మాణాన్ని అన్వేషిస్తున్న క్రమంలో శాస్త్రవేత్తలకు ఆక్టోపస్‌ నర్సరీ కనిపించింది. ఈ రీసెర్చ్ టీమ్ కు భారత సంతతికి చెందిన డాక్టర్ జ్యోతిక వీరమణి నేతృత్వం వహించారు. ఆమె ప్రస్తుతం ష్మిత్ ఓషియన్ ఇన్ స్టిట్యూట్ కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సేవలందిస్తున్నారు.