Synthetic Human Embryo : అండం..వీర్యం..రెండూ లేకుండానే కృత్రిమ పిండం

Synthetic Human Embryo : స్త్రీ అండం.. పురుష వీర్యం.. ఇవి రెండూ కలిసి ఫలదీకరణ జరిగితేనే "పిండం" ఏర్పడుతుంది. కానీ ఈ సహజ ప్రక్రియకు పూర్తి విరుద్ధంగా ఒక ప్రయోగం సక్సెస్ అయింది. 

Published By: HashtagU Telugu Desk
Synthetic Human Embryo

Synthetic Human Embryo

Synthetic Human Embryo : స్త్రీ అండం.. పురుష వీర్యం.. ఇవి రెండూ కలిసి ఫలదీకరణ జరిగితేనే “పిండం” ఏర్పడుతుంది. 

కానీ ఈ సహజ ప్రక్రియకు పూర్తి విరుద్ధంగా ఒక ప్రయోగం సక్సెస్ అయింది. 

పురుష వీర్యం.. స్త్రీ అండం.. ఇవి రెండూ లేకుండానే కృత్రిమ పిండాన్ని అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తల ఉమ్మడి టీమ్ ల్యాబ్ లో అభివృద్ధి చేసింది.

పురుష వీర్యం.. స్త్రీ అండం.. ఇవి రెండూ లేకుండా కేవలం స్టెమ్ సెల్స్ (మూల కణాల) తో ఈ కృత్రిమ పిండాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. స్టెమ్ సెల్స్ అంటే కండర కణాలు, రక్త కణాలు, మెదడు కణాలు వంటి శరీరంలోని అనేక రకాల ప్రత్యేక కణాలు. ఈ కణాలలో  పునరుత్పత్తి అయ్యే సామర్ధ్యం ఉంది. ఇవి వాటికి అవిగా విభజన చెంది..తమను తాము  పునరుద్ధరించుకోగలవు. ఈ స్టెమ్ సెల్స్  కణాలే మానవ శరీరానికి మరమ్మతు వ్యవస్థగా పనిచేస్తాయి. మనిషి పుట్టుకపై జన్యుపరమైన రుగ్మతల ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి.. గర్భస్రావాలు కొందరికి ఎక్కువగా జరగడానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఈ కృత్రిమ పిండం(Synthetic Human Embryo) కొత్త బాటలు వేయనుంది.

Also read : Bird: పక్షికి మాత్రమే పిండం పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసా?

కృత్రిమ పిండంలో ఏం ఉంటుంది ?

పురుష వీర్యం.. స్త్రీ అండం.. లేకుండా అభివృద్ధి చేసిన  కృత్రిమ పిండంలో ఏమేం ఉంటాయనేది శాస్త్రవేత్తలు తెలిపారు. అందులో మావి(ప్లాసెంటా) కణాలు, గర్భస్థ పిండం పై పొర (యోక్ శాక్)లోని కణాలు , పిండాన్ని ఏర్పరిచే కణాలు ఉంటాయని చెప్పారు. అయితే ఇందులో సజీవమైన గుండె నిర్మాణానికి అవసరమైం కణాలు కానీ.. మెదడు నిర్మాణానికి అవసరమైన  3 మిల్లీ మీటర్ల న్యూరల్ ట్యూబ్ కానీ ఉండదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

Also read : Fetus Removed: చైనాలో వింత ఘటన.. ఏడాది చిన్నారి మెదడులో పిండం

మహిళల గర్భంలోకి ఈ పిండాన్ని ప్రవేశ పెట్టొచ్చా ?

అమెరికాలోని బోస్టన్ లో ఉన్న “ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ స్టెమ్ సెల్ రీసెర్చ్” వార్షిక సమావేశంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన వివరాలను వెల్లడించారు. పిండ (ఎంబ్రయో) మూలకణాల రీప్రొగ్రామింగ్ ద్వారా మానవ పిండం లాంటి నమూనాలను సృష్టించవచ్చని వారు చెప్పారు.  అయితే తాము అభివృద్ధి చేసిన సింథటిక్ పిండాలను వైద్యపరంగా ఉపయోగించుకునే అవకాశం లేదని, వాటిని మహిళల గర్భంలోకి ప్రవేశపెట్టడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ఈ కృత్రిమ పిండంలోని కణాల నిర్మాణాలు పరిపక్వం చెందగలవా ?  లేదా ? అనేది ఇంకా తెలియదన్నారు.  అంతకుముందు, ఇజ్రాయెల్‌లోని వీజ్‌మాన్ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తల  బృందం..  ఎలుకల మూలకణాలతో పేగులు, కొట్టుకునే గుండెతో కూడిన  తొలిదశ మానవ  పిండం అభివృద్ధి  చేయొచ్చని గుర్తించింది.

  Last Updated: 16 Jun 2023, 02:24 PM IST