Site icon HashtagU Telugu

Telangana : తెలంగాణ‌లో వేస‌వి సెల‌వులు పొడిగింపు లేదు – మంత్రి స‌బితా

Sabitha Indra Reddy

Sabitha Indra Reddy

కోవిడ్-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు వస్తున్న వార్తలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం తోసిపుచ్చారు. ఇలాంటి ఊహాగానాలు నమ్మవద్దని విద్యార్థుల‌ తల్లిదండ్రులను ఆమె కోరారు. తెలంగాణలో విద్యాసంస్థలు షెడ్యూల్ ప్రకారం జూన్ 13 (సోమవారం ) నుంచి ప్రారంభ‌మ‌వుతాయ‌ని.. వేసవి సెలవులకు పొడగింపు లేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో వైరస్ కేసులు పెరుగుతున్నందున.. 12 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలు, యుక్తవయస్సు ఉన్న పిల్లలకు టీకాలు వేయాలని ప్రభుత్వం తల్లిదండ్రులను కోరింది.