Students Fight on Camera:కోయంబత్తూర్‌లోని బస్టాండ్‌లో కొట్టుకున్న విద్యార్థులు.. వీడియో వైర‌ల్‌

తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని ఒండిపుదూర్‌లోని బస్టాండ్‌లో పాఠశాల విద్యార్థులు కొట్టుకున్న వీడియో వైర‌ల్ అవుతుంది. ఒకరితో ఒకరు గొడవపడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

  • Written By:
  • Publish Date - April 28, 2022 / 12:29 PM IST

తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని ఒండిపుదూర్‌లోని బస్టాండ్‌లో పాఠశాల విద్యార్థులు కొట్టుకున్న వీడియో వైర‌ల్ అవుతుంది. ఒకరితో ఒకరు గొడవపడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇద్దరు విద్యార్థులను ఇతర విద్యార్థుల బృందం దారుణంగా కొట్టిన వీడియోను ఓ ప్రయాణీకుడు తన ఫోన్ కెమెరాలో రికార్డ్ చేశాడు. యూనిఫామ్‌లో ఉండ‌టంతో వారంతో పాఠ‌శాల విద్యార్థులుగా గుర్తించారు. అక్క‌డ గొడవ జరగడం చూసి బ‌స్సులోని ప్రయాణికులు షాక్‌కి గురైయ్యారు. విద్యార్థులు బస్సుల్లో ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణించడం, ఉపాధ్యాయులను వేధించడం, గ్రూపులుగా ఏర్ప‌డి కొట్టుకోవ‌డం వంటి సంఘటనలు తమిళనాడులో పెరుగుతున్నాయి. చెన్నైలోని న్యూ వాషర్‌మెన్‌పేట్‌లోని బస్టాండ్‌లో కళాశాల విద్యార్థుల మధ్య వాగ్వాదం ఘ‌ర్ష‌ణ‌కు దారితీసింది.

పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని వారికి సలహా ఇచ్చి వార్నింగ్‌తో వదిలిపెట్టారు. విద్యార్థులు అలాంటి కార్యకలాపాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేస్తూ త‌మిళ‌నాడు బీజేపీ శైలేంద్ర బాబు ఒక వీడియోను విడుదల చేశారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని.. త‌న‌ తల్లిదండ్రులకు పెద్దగా సంపద లేదు, కానీ మా సంపద మా తరగతి గది డెస్క్‌లు, కుర్చీలు అని ఆయ‌న తెలిపారు మెరుగైన ప్రపంచం గురించి బోధిస్తున్న ఉపాధ్యాయులపై దాడి చేయడకూడం ఎంత‌వ‌ర‌కు స‌మ‌జస‌మ‌ని ఆయ‌న ప్రశ్నించారు. విద్యార్థులు తమ చదువుపై దృష్టి సారించాలని, మంచి జీవితాన్ని గడపడానికి మార్గం చూపే ఉపాధ్యాయులను గౌరవించాలని ఆయన కోరారు.