Site icon HashtagU Telugu

School Bus Accident : ప‌ల్నాడులో స్కూల్ బ‌స్సు బోల్తా.. 15 మంది విద్యార్థుల‌కు గాయాలు

Mexico Bus Crash

Road accident

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా పమిడిమర్రు గ్రామంలో పాఠశాల బస్సు బోల్తా ప‌డింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. ప్ర‌మాద స‌మ‌యంలో అక్క‌డే ఉన్న స్థానికులు విద్యార్థులను రక్షించడానికి ప్రమాద స్థలానికి చేరుకున్నారు. డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యమే ప్ర‌మాదానికి గ‌ల కార‌ణ‌మ‌ని స్థానికులు తెలిపారు. గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బ‌స్సులో సామర్థ్యానికి మించి పాఠశాల విద్యార్థులను ఎక్కించార‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఆరోపించారు. జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్‌ కూడా ఆసుపత్రిని సందర్శించి గాయపడిన విద్యార్థుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరిమితికి మించి విద్యార్థులను బ‌స్సుల్లో ఎక్కించారనే తల్లిదండ్రుల ఆరోపణపై విచారణ చేస్తామ‌ని ఆయ‌న తెలిపారు. విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామని డీఈవో తెలిపారు. అవసరమైతే స్కూల్ యాజమాన్యం, డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామ‌ని డీఈవో శామ్యూల్‌ తెలిపారు.