స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను (Independence Day) ఎంతో సంతోషంగా జరుపుకొని ఇంటికి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం (Road Accident) ఆ విద్యార్థుల కుటుంబాల్లో ఆందోళన నింపింది. నిత్యం రోడ్డు ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికొచ్చే వరకు టెన్షన్..టెన్షనే. ఓవర్ స్పీడ్ , మద్యం మత్తులో డ్రైవింగ్ , నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రతి రోజు పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ.. ఆయా కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి.
తాజాగా మంగళవారం ఏపీలోని బాపట్ల జిల్లా (Bapatla District) అమృతలూరు మండలంలో ఓ స్కూల్ బస్సు బోల్తా (School Bus Accident) పడిన ఘటన విద్యార్థుల కుటుంబాల్లో ఆందోళన కలిగించింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుని పాఠశాల నుంచి ఇళ్లకు తిరుగు పయనం అవ్వగా.. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన కూచిపూడి-పెద్దపూడి గ్రామాల మధ్య చోటుచేసుకుంది. ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది విద్యార్థులు ఉండగా..14 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గాయపడిన విద్యార్థులను 108 వాహనంలో తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదానికి కారణం ఓవర్ స్పీడ్ అన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
Read Also : Ola Scooter 79999 : రూ.80వేలకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. వచ్చే నెల నుంచి డెలివరీలు