ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో పలు చోట్ల ఆదివారం ఉదయం మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ప్రజలు వారి వారి పనుల్లో ఉండగా భూకంపం (Earthquake) వచ్చి భూమి సెకండ్లలో కంపించిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సంఘటనతో ఇటీవలే జరిగిన సిరియా టర్కీ దృశ్యాలు కళ్లముందు కనిపించాయని స్థానికులు తెలిపారు.
Also Read: Kanna Lakshminarayana: టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ..? ఈనెల 23న చంద్రబాబు సమక్షంలో చేరిక..!
అంతకముందు ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పులిచింతల ప్రాజెక్టు పరిసరాల్లో భూమి కంపించింది. ఇలా భూమి కంపించడంతో అక్కడి స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అచ్చంపేట మండలంలోని మాదిపాడు, చల్లగరిగలో భూమి కంపించింది.