National Commission For Men: గృహ హింసకు గురైన వివాహిత మగవారి ఆత్మహత్యలకు సంబంధించి మార్గదర్శకాలు, పురుషుల కోసం జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. నేషనల్ కమిషన్ ఫర్ మెన్ ఈ అంశాలను పరిశీలించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. వివాహిత పురుషుల ఆత్మహత్యల సమస్యను పరిష్కరించడానికి సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు జూలై 3న విచారించనుంది. న్యాయమూర్తులు సూర్యకాంత్ మరియు దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించనుంది.
2021లో దేశవ్యాప్తంగా 1,64,033 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని న్యాయవాది మహేష్ కుమార్ తివారీ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. వీరిలో 81,063 మంది వివాహిత పురుషులు కాగా, 28,680 మంది వివాహిత మహిళలు ఉన్నారని పిటిషన్‌లో పేర్కొంది. 2021 సంవత్సరంలో 33.2 శాతం మంది పురుషులు కుటుంబ సమస్యల కారణంగా మరియు 4.8 శాతం మంది వివాహ సంబంధిత సమస్యల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Read More: Cracked Heels: పాదాల పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే చేయాల్సిందే?