Supreme Court: రూ. 2 వేల నోటు మార్పిడి పై సుప్రీంకోర్టులో పిటిషన్.. కోర్టు ఏం చెప్పిందో తెలుసా?

రూ.2 వేల నోటు రద్దు నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వారి దగ్గర ఉన్న రూ.

  • Written By:
  • Publish Date - June 1, 2023 / 07:45 PM IST

రూ.2 వేల నోటు రద్దు నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వారి దగ్గర ఉన్న రూ.2 వేల రూపాయల నోట్లను ఇలా మార్పిడి చేసుకోవాలో తెలియక తిప్పలు పడుతున్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం వాటిని మార్పిడి చేసుకోవడం కోసం సెప్టెంబర్ చివరి వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. రెండు వేల నోట్లను ఎటువంటి ఐడీ ప్రూఫ్‌, దరఖాస్తు లేకుండా మార్పిడి చేసుకోవచ్చంటూ బ్యాంకులు ఇచ్చిన నోటిఫికేషన్ లపై సుప్రీమ్ కోర్టులో పిటిషన్‌ దాఖలు అయ్యింది.

అయితే, దీనిని అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించిన సుప్రీం ధర్మాసనం వేసవి సెలవుల సమయంలో అటువంటి అభ్యర్థనను స్వీకరించమంటూ స్పష్టం చేసింది. రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు దరఖాస్తు, ఐడీ ప్రూఫ్‌ అవసరం లేదనడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టు లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆధార్‌ వంటివి అవసరం లేకున్నా వీటిని తీసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

స్వల్ప సమయంలోనే రూ.50వేల కోట్ల విలువైన పెద్ద నోట్ల మార్పిడి జరిగిందన్న ఆయన నేరస్థులు, ఉగ్రవాదులు దీన్ని ఉపయోగించుకునే ప్రమాదం ఉందన్నారు. దీనిని పరిశీలించిన సుప్రీంకోర్టులోని జస్టిస్‌ సుధాన్షు దులియా, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం వేసవి సెలవుల్లో ఈ తరహా కేసులు విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. ఇది ఇలా ఉంటే మరొకవైపు ప్రజలు నోట్లోను మార్పిడి చేసుకోవడం కోసం బ్యాంకుల వద్దకు క్యూకడుతున్నారు. అంతేకాకుండా ఈ 2 వేల నోట్లను మార్చుకోవడం కోసం గంటల తరబడి క్యూ లైన్ లలో నిలబడి ఉంటున్నారు.