Supreme Slams: డిఫెన్స్ లాయర్ కి చీఫ్ జస్టిస్ వార్నింగ్

బెయిల్‌ మంజూరైన అత్యాచార నిందితుడికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన హోర్డింగ్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

బెయిల్‌ మంజూరైన అత్యాచార నిందితుడికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన హోర్డింగ్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. హోర్డింగ్స్ పెట్టేవాళ్ళు ఆలోచన చేయాలని, అనాలోచితంగా పెట్టె హోర్డింగ్స్ తో వాటి విలువ దిగజారి పోతోందని తెలిపిన జస్టిస్ రమణ హోర్డింగ్స్ వల్ల మంచోడు, చెడ్డోడు ఒకే కోవలోకి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచార నిందితుడి కోసం భయ్యా ఈజ్‌ బ్యాక్‌ అంటూ ఏర్పాటు చేసిన హోర్డింగు పై స్పందిస్తూ మీ భయ్యాను జాగ్రత్తగా ఉండమనండని సీజేఐ వ్యాఖ్యానించారు. ఈ హోర్డింగ్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి బెయిల్‌ను రద్దు చేయాలంటూ బాధితురాలు సుప్రీంను ఆశ్రయించింది. విచారణ సందర్భంగా హోర్డింగు విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకురాగా….డిఫెన్స్‌ న్యాయవాదిని ఉద్దేశిస్తూ…. భయ్యా ఈజ్‌ బ్యాక్‌ అని హోర్డింగు పెట్టడమేంటి? అసలు దీని అర్థమేంటి? ఈ వారం మీ భయ్యాను జాగ్రత్తగా ఉండమని చెప్పండని సుప్రీం హెచ్చరించింది.