TS Gets New Chief Justice:తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ.. కొత్త చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యామూర్తిగా బదిలీ అయ్యారు.

Published By: HashtagU Telugu Desk
Ujwal Bhuyan

Ujwal Bhuyan

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యామూర్తిగా బదిలీ అయ్యారు.
ఆయన స్థానంలో కొత్త చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్ ను సుప్రీంకోర్టు కొలీజియం నియమించింది. 2021 అక్టోబర్ 22 నుంచి ఆయన తెలంగాణ హైకోర్టు న్యాయ మూర్తిగా ఉన్నారు. జస్టిస్ భుయాన్ 2011 అక్టోబర్ 17న గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితుల య్యారు. 2013 మార్చి 20న నిర్ధారణ పొందారు. మిజోరాం స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా ఉన్నారు. జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అస్సాం జ్యుడీషియల్ అకాడమీ, గౌహతిలోని నేషనల్ లా యూనివర్శిటీలతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు.తర్వాత ఆయన బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2019 అక్టోబర్ 3న బాంబే హైకోర్టులో న్యాయ మూర్తిగా ప్రమాణం చేశారు. ముంబైలో రెండేళ్లపాటు పనిచేశాక.. ఆయన తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021 అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా ఉన్నారు.

  Last Updated: 17 May 2022, 04:10 PM IST