2021-22 విద్యా సంవత్సరానికి గాను నీట్-పీజీ ప్రవేశాలు చేపట్టేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతి తెలిపింది. ఓబీసీలకు 27%.. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ఈడబ్ల్యూఎస్) 10% కోటా అమలుకు రాజ్యాంగబద్ధ హోదాను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు కోర్టు పేర్కొంది.
ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబాటు అర్హతను నిర్ధారించేందుకు రూ.8లక్షల ఆదాయ పరిమితికి సుప్రీంకోర్టు సమ్మతి తెలిపింది. అది కూడా ప్రస్తుత విద్యా సంవత్సరానికి మాత్రమే అమలుకానుందని జస్టిస్ డీవై చంద్రచూద్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.