Atiq Murder Case: ఏప్రిల్ 24న అతిక్ హత్యపై సుప్రీంలో విచారణ

దేశంలో సంచలనం సృష్టించిన అతిక్ అహ్మద్ హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది రాజకీయ హత్యగా అభివర్ణిస్తూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి

Atiq Murder Case: దేశంలో సంచలనం సృష్టించిన అతిక్ అహ్మద్ హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది రాజకీయ హత్యగా అభివర్ణిస్తూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆధ్వర్యంలో ఈ ఎన్ కౌంటర్లు జరుగుతున్నట్టు విపక్షాలు మండిపడ్డాయి. ఇక తాజాగా అసదుద్దీన్ ఒవైసీ ఈ ఇష్యూపై సంచలన ఆరోపణలు చేస్తారు.అతిక్ హత్య ప్రభుత్వ హత్యగా తేల్చేశారు. మరోవైపు ప్రముఖ న్యాయవాది మరియు ఓ సీనియర్ ఐపీఎస్ ఒకరు ఈ కేసుని సీబీఐ కి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

క్రిమినల్ అతిక్ అహ్మద్ మరియు అతని సోదరుడు అష్రఫ్ హత్య కేసును సుప్రీంకోర్టు ఈ నెల ఏప్రిల్ 24 న విచారించనుంది. దీనితో పాటు 2017 నుండి యుపిలో 183 ఎన్‌కౌంటర్లపై దర్యాప్తు చేయాలన్న డిమాండ్‌ను కూడా సుప్రీంకోర్టు విచారించనుంది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విశాల్‌ తివారీ అనే న్యాయవాది ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

దీంతో పాటు మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ కూడా ఈ హత్యపై సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన కోర్టును కోరారు. ఈ వ్యవహారంపై ఓ స్పష్టత రావాలంటే సీబీఐ విచారణ జరపడం చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

అతిక్, అష్రఫ్ పై దుండగులు కిరాతంగా కాల్చి చంపేశారు. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వీరిద్దర్నీ మెడికల్ చెకప్ కోసం పోలీసులు తీసుకెళ్తుండగా అక్కడే ఉన్న మీడియా వారిని పలు ప్రశ్నలు సంధించింది. ఈ క్రమంలో అతిక్ మీడియాతో మాట్లాడుతుండగా.. ఓ వ్యక్తి ఒక్కసారిగా కాల్పుల మోత మోగించాడు. దీంతో అతిక్, అష్రఫ్ అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. దీంతో ఈ కేసు ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది.

Read More: US Helicopter Raid: సిరియాలో యూఎస్ మిలిటరీ హెలికాప్టర్ దాడి.. ఇస్లామిక్ స్టేట్ సీనియర్ నాయకుడు మృతి