SBI: రేపటి నుంచి అమలు చేయనున్న ఎస్బీఐ… ఆ కస్టమర్లకు షాకే!

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఎస్బీఐ తన కస్టమర్లకు భారీ షాకిచ్చింది. తన బేస్‌ రేట్‌, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్లను పెంచింది. బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు 70 బేసిస్ పాయిం ట్లు లేదా 0.7 శాతం పెంచింది.

Published By: HashtagU Telugu Desk
Whatsapp Image 2023 03 14 At 21.18.33

Whatsapp Image 2023 03 14 At 21.18.33

SBI: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఎస్బీఐ తన కస్టమర్లకు భారీ షాకిచ్చింది. తన బేస్‌ రేట్‌, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్లను పెంచింది. బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు 70 బేసిస్ పాయిం ట్లు లేదా 0.7 శాతం పెంచింది. దీంతో బీపీఎల్‌ఆర్‌ రేటు 14.85 శాతానికి చేరింది. అలాగే పబ్లిక్ లెండర్ బేస్ రేటును 9.40 శాతం నుండి 10.10 శాతానికి పెంచింది.

మార్చి15 అంటే రేపటి నుంచి సవరించిన రేట్లు అమల్లోకి రానున్నాయి. దీంతో ఎస్సీబీలో రుణాలు తీసుకున్న వినియోగదారుల నెలవారీ ఈఎంఐ పెరగనున్నాయి. అన్ని రుణాలకు వర్తించే కనీస రేటునే బేస్‌ రేటు అంటారు. అంటే నిర్ణయించిన రేటు కంటే తక్కువకు రుణాలివ్వడానికి వీలుండదు. ఇక బీపీఎల్‌ఆర్‌ అనేది బేస్‌ రేటుకు ముందున్న రుణాలకు మాత్రమే వర్తించే రేటు. అయితే ఫండ్స్ ఆధారిత రుణరేట్ల మార్జినల్ రేటు యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది.

ఇది గృహ రుణాల రేటుపై ప్రభావం చూపదని తెలిపింది. ఎంసీఎల్‌ఆర్‌ అంటే బ్యాంకు ఖాతాదారులకు రుణాలు ఇచ్చే రేటు. కాగా ఫిబ్రవరి 15, 2023న 10 బేసిస్ పాయింట్లు లేదా 0.1 శాతం పెంచింది. దీని ప్రకారం ఒక ఏడాది రుణాలు, రెం డేళ్ల,మూడేళ్ల రుణాలకు వర్తించే వడ్డీ రేట్లు వరుసగా 8.50 శాతం , 8.60 శాతం మరియు 8.70 శాతంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే క్రమంలో ఆర్బీఐ తన ఫిబ్రవరి 8 నాటి పాలసీ రివ్యూలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి
పెంచింది.

  Last Updated: 14 Mar 2023, 09:26 PM IST