SBI : దేశంలో డిజిటల్ లావాదేవీలు వేగంగా పెరుగుతున్న తరుణంలో, సైబర్ మోసాలు కూడా అదే రీతిలో పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ ఖాతాదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కీలక సూచనలు విడుదల చేసింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, “+91-1600” తో ప్రారంభమయ్యే ఫోన్ నంబర్ల నుంచి వచ్చే కాల్స్ గురించి ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. ఈ నంబర్లు బ్యాంకు లావాదేవీలు, సేవలపై సమాచారాన్ని అందించేందుకు మాత్రమే ఉపయోగించబడతాయని బ్యాంకు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఎస్‌బీఐ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా, “+91-1600తో మొదలయ్యే నంబర్ నుంచి మీకు కాల్ వచ్చినప్పుడు అది నిజమైనదే. చట్టబద్ధమైన సేవల కోసం మాత్రమే మేము ఈ నంబర్లను వినియోగిస్తాం. స్పామ్ లేదా మోసపూరిత కాల్స్‌తో భ్రమ పడవద్దు. సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్త వహించండి,” అని సూచించింది.
Drinking Alcohol: మద్యం సేవించే వారికే ఈ సమస్య ఉందా? అయితే ఇది తెలుసుకోండి!
ఈ చర్యలు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తీసుకున్నవేనని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. 2025 జనవరి 17న ఆర్‌బీఐ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, అన్ని బ్యాంకులు , నియంత్రిత సంస్థలు (REs) తమ ఖాతాదారులకు లావాదేవీలు లేదా సేవల కోసం ఫోన్ చేయాల్సిన సందర్భాల్లో “1600xx” సిరీస్‌తో ప్రారంభమయ్యే నంబర్లను మాత్రమే ఉపయోగించాలి. అదే విధంగా, మార్కెటింగ్ లేదా ప్రచార ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా “140xx” సిరీస్ నంబర్లను మాత్రమే వాడాలని ఆదేశించింది.
ఈ విధంగా, వినియోగదారులు అసలైన, నకిలీ కాల్స్ మధ్య తేడాను సులభంగా గుర్తించి, సైబర్ మోసాలను నివారించగలుగుతారు. బ్యాంకులు తీసుకుంటున్న ఈ ముందస్తు చర్యలు ఖాతాదారుల భద్రతను బలోపేతం చేయడంలో సహాయపడతాయని భావిస్తున్నారు.
Michael Letko: మరో వైరస్ కు వేదికైన చైనా.. ఇది కరోనాకంటే డేంజరంట..!
ఎస్‌బీఐ అధికారిక నంబర్లు
* 1600-01-8000
* 1600-01-8003
* 1600-01-8006
* 1600-11-7012
* 1600-11-7015
* 1600-01-8001
* 1600-01-8004
* 1600-01-8007
* 1600-11-7013
* 1600-00-1351
* 1600-01-8002
* 1600-01-8005
* 1600-11-7011
* 1600-01-7014
* 1600-10-0021