SBI PO: గుడ్ న్యూస్.. ఎస్బీఐలో 2000 పీవో పోస్టులకు దరఖాస్తులు.. అర్హతలు ఇవే..!

ఎస్‌బీఐలో పీవో (SBI PO) ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. నేటి నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ మొదలుకానుంది.

  • Written By:
  • Publish Date - September 7, 2023 / 08:54 AM IST

SBI PO: ఎస్‌బీఐలో పీవో (SBI PO) ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. నేటి నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ మొదలుకానుంది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బుధవారం, సెప్టెంబర్ 6, 2023 (నం.CRPD/PO/2023-24/19) నాడు బ్యాంక్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 2000 PO పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వీటిలో 810 జనరల్ కేటగిరీకి, 540 ఓబీసీకి, 200 ఈడబ్ల్యూఎస్‌కి, 300 ఎస్సీ, 150 ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు రిజర్వు చేయబడ్డాయి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 PO పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియను ఈ రోజు నుండి అంటే గురువారం సెప్టెంబర్ 7, 2023 నుండి ప్రారంభించింది. నిర్ణీత అర్హతను కలిగి ఉన్న అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్, కెరీర్ విభాగంలోని sbi.co.in నుండి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను యాక్టివ్ లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సంబంధిత అప్లికేషన్ పేజీని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

SBI PO పరీక్ష 2023-24 కోసం దరఖాస్తు చివరి తేదీ 27 సెప్టెంబర్ 2023గా అధికారులు పేర్కొన్నారు. ఈ తేదీలోగా అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నిర్ణీత పరీక్ష రుసుము రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Also Read: Petrol-Diesel Price: తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!

రిక్రూట్‌మెంట్ కోసం అర్హత ప్రమాణాలు

దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు బ్యాంక్ సూచించిన అర్హత ప్రమాణాలను తెలుసుకోవాలి. SBI PO పరీక్ష 2023 నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా ఏదైనా ఇతర ఉన్నత విద్యా సంస్థ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.

అలాగే అభ్యర్థుల వయస్సు 1 ఏప్రిల్ 2023 నాటికి 21 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. 30 సంవత్సరాలకు మించకూడదు. అయితే రిజర్వ్ చేయబడిన వర్గాలకు చెందిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది. మరిన్ని వివరాలు, ఇతర వివరాల కోసం SBI PO నోటిఫికేషన్ 2023ని చూడవచచ్చు.

ఎంపిక విధానం

బ్యాంకు పీవో ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో చేపడతారు. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ పరీక్ష, సైకోమెట్రిక్‌ టెస్ట్‌, గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

వేతనం

ఉద్యోగాలకు ఎంపికైన వారికి బేసిక్ పేస్కేల్ రూ. 41,960 (ఇతర సౌకర్యాలు).

తెలుగు ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు

చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌.

మెయిన్స్‌ పరీక్ష కేంద్రాలు

గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌.