SBI Jobs: భారత్ లో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBIలో 5 వేలకు పైగా పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. SBI కు సంబంధించిన వివిధ సర్కిళ్లలో మొత్తం 5,447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాల దరఖాస్తులకు మరో రెండ్రోజుల్లో గడువు ముగియనుంది. డిసెంబర్ 12తోనే గడువు ముగియగా.. డిసెంబర్ 17 వరకూ దరఖాస్తులకు గడువు పొడిగించారు. మొత్తం ఉద్యోగాల్లో తెలుగు రాష్ట్రాల్లో 800కు పైగా ఉద్యోగాలున్నాయి.
ఆర్బీఐ లిస్ట్ లో ఉన్న ఏదైనా బ్యాంకులో గరిష్ఠంగా రెండేళ్లపాటు పనిచేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులని SBI తెలిపింది. ఆసక్తికల అభ్యర్థులు డిసెంబర్ 17 లోగా https://ibpsonline.ibps.in/sbicbosep23/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ లో ముఖ్యాంశాలు
- దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత పొంది ఉండాలి. అలాగే ఆర్బీఐ లిస్ట్ లో ఉన్న బ్యాంకింగ్ రంగంలో రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
- వయసు మార్చి 31,2023 నాటికి 21 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి.
- ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.36 వేలు నుంచి రూ.63,840 వరకూ వేతనం చెల్లిస్తారు.
- ఆన్ లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా పోస్టులకు ఎంపిక చేస్తారు.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయింపు ఉంటుంది. మిగతా వారు రూ.750 చెల్లించాలి. వచ్చే ఏడాది జనవరిలో వ్రాత పరీక్ష జరగవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని గుంటూరు, కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ లలో పరీక్షలు నిర్వహిస్తారు.