Site icon HashtagU Telugu

SBI: అమృత్ కలశ్ డిపాజిట్ స్కీమ్ ను మరోసారి పొడిగించిన ఎస్‌బీఐ?

Sbi

Sbi

తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన పరిమితకాల స్పెషల్‌ డిపాజిట్‌ స్కీమ్‌ అమృత్‌ కలశ్‌ డిపాజిట్‌ పథకం గడువును మరోసారి పొడిగించింది. 400 రోజుల కాలవ్యవధితో వస్తున్న ఈ పథకం జూన్‌ 30తో ముగియాల్సి ఉంది. కానీ తాజాగా తాజాగా ఆ గడువును ఆగస్టు 15 వరకు పొడిగించింది. గతంలో కూడా ఈ గడువును ఒక సారి పునరుద్ధరించింది ఎస్‌బీఐ. కాగా ఈ అమృత్ కలశ్ డిపాజిట్ పథకం కింద సీనియర్‌ సిటిజన్లకు 7.6 శాతం, మిగిలిన వారికి 7.1 శాతం వడ్డీరేటు లభిస్తుంది.

ఆదాయ పన్ను చట్టం ప్రకారం వడ్డీపై మూలం వద్ద పన్ను కోత కూడా ఉంటుంది. ఎస్‌బీఐ శాఖలు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.2 కోట్లలోపు మొత్తాలకు ఈ స్కీమ్‌ వర్తిస్తుంది. స్వల్పకాలిక లక్ష్యంతో మదుపు చేసేవారికి అమృత్‌ కలశ్‌ పథకం ప్రయోజనకరంగా ఉంటుంది. పైగా డిపాజిట్‌ను ముందుగా ఉపసంహరించుకోవచ్చు. అలాగే రుణ సదుపాయం కూడా ఉంది. ప్రస్తుతం ఎస్‌బీఐ 7 రోజుల నుంచి 10 ఏళ్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల పై సాధారణ పౌరులకు 3 నుంచి 7 శాతం వడ్డీరేటును చెల్లిస్తోంది.

సీనియర్‌ సిటిజన్లకు 3.5 శాతం నుంచి 7.50 శాతం అధికంగా ఇస్తోంది. ఎస్‌బీఐ సిబ్బంది, పింఛన దారులకు ఒక శాతం వడ్డీరేటు అదనంగా ఇవ్వనుంది. ఇకపోతే చివరి తేదీ ఎంత వడ్డీఅన్న వివరాల విషయానికొస్తే.. కాలపరిమితి 400 రోజులు. ఈ గడువుకు చివరి తేదీ 2023 ఆగస్టు 15. అలాగే ఎంత వడ్డీ అన్న విషయానికొస్తే.. సీనియర్‌ సిటిజన్లకు 7.6 శాతం కాగా మిగిలిన వారికి 7.1 శాతం.

Exit mobile version