Site icon HashtagU Telugu

RR vs SRH Dream11 Prediction: RR vs SRH పిచ్ రిపోర్ట్..

RR vs SRH Dream11 Prediction

Sawai Mansingh Stadium

RR vs SRH Dream11 Prediction: జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. సవాయ్ మాన్ సింగ్ స్టేడియం పిచ్ బ్యాట్స్‌మెన్ మరియు స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. మరోవైపు ఛేజింగ్ జట్టుకి పిచ్ అనుకూలంగా కనపడుతుంది. ఇక్కడ సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 170. చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు హోం గ్రౌండ్‌లో మొత్తం 49 మ్యాచ్‌లు ఆడింది. అందులో 33 మ్యాచ్‌లు గెలిచి 16 మ్యాచ్‌ల్లో ఓడింది. ఈ మ్యాచ్‌లలో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 11 సార్లు మ్యాచ్‌ను గెలుపొందగా, ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన 22 సార్లు విజయం సాధించింది.

ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ టోర్నీలో పోరాడుతున్నట్లు కనిపిస్తోంది. చాలా మార్పుల కారణంగా ప్లేయర్‌లు ఇంకా సెట్ కాలేకపోతున్నారు. హ్యారీ బ్రూక్ పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. రాహుల్ త్రిపాఠి అంతంత మాత్రమే కనిపిస్తున్నాడు. మార్కండేయ మరియు భువనేశ్వర్ కుమార్ మాత్రమే బాగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో రైజర్స్ టీమ్ బౌలింగ్ లోనూ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. హైదరాబాద్ ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవాలంటే.. పటిష్ట ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.

రాజస్థాన్ రాయల్స్ vs హైదరాబాద్ మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం 10 శాతం ఉంది. జైపూర్‌లో కేవలం 10 శాతం మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అదే సమయంలో, ఉష్ణోగ్రత 38-25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. గంటకు 19 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.

Read More: GT vs LSG: ‘వాట్ ఎ ప్లేయర్’ అంటూ వృద్ధిమాన్ పై కోహ్లీ ప్రశంసలు