Samosa: ఛీ.. ఛీ..! 30 ఏళ్లుగా టాయిలెట్ లో సమోసాల తయారీ!

సమోస అంటే ఎవరికైనా ఇష్టమే. సాయంత్రం సమయంలో ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేస్తూ సమోసాలను టెస్ట్ ను చేస్తుంటారు చాలామంది.

  • Written By:
  • Updated On - April 27, 2022 / 11:26 AM IST

సమోస అంటే ఎవరికైనా ఇష్టమే. సాయంత్రం సమయంలో ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేస్తూ సమోసాలను టెస్ట్ ను చేస్తుంటారు చాలామంది. అయితే ఇకముందు సమోసాను తినాలనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే.. సౌదీ అరేబియాలో (KSA) ఓ రెస్టారెంట్ నిర్వాహకులు 30 సంవత్సరాలకు పైగా టాయిలెట్‌లో సమోసాలు, స్నాక్స్ తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. జెడ్డా మునిసిపాలిటీ 30 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న రెస్టారెంట్‌పై అధికారులు దాడులు చేశారు. అరబిక్ దినపత్రిక ఓకాజ్ ప్రకారం.. వాష్‌రూమ్‌లో స్వీట్లు, ఇతర ఆహార పదార్థాలు తయారయ్యాయి. మాంసాహారం, కోడిమాంసం, జున్ను లాంటివి కూడా అమ్ముతున్నారు. అయితే వాటికి ఉపయోగించే పదార్థాలు కల్తీవని తేలింది. 30 ఏళ్లుగా అక్కడ సమోసాలు తినే కస్టమర్లు ఈ విషయం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.