Site icon HashtagU Telugu

FIFA World Cup: ప్రతి ఆటగాడికి రూ.10 కోట్ల కారు.. అసలు నిజం ఇదే..!

Cropped (4)

Cropped (4)

FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 గ్రూప్ స్టేజ్‌ల మ్యాచ్‌లో అర్జెంటీనాను 2-1తో ఓడించినందుకు ప్రతి ఆటగాడికి రోల్స్ రాయిస్ కారు రివార్డ్ వార్తలపై సౌదీఅరేబియా జట్టు ఫుట్‌బాల్ ఆటగాడు అల్షెహ్రీ స్పందించాడు. అలాంటి వార్తలను నమ్మొద్దని స్పష్టం చేశాడు. అల్షెహ్రీ మాట్లాడుతూ.. “మేము మా దేశానికి సేవ చేయడానికి, ఉత్తమంగా చేయడానికి ఇక్కడికి వచ్చాము. కనుక ఇది మా అతిపెద్ద విజయం” అని విలేకరుల సమావేశంలో అన్నారు. తన దేశానికి సేవ చేయడమే తనకు అవసరమైన ఏకైక ప్రతిఫలమని అల్షెహ్రీ వివరించాడు.

అర్జెంటీనాపై గెలిచిన తర్వాత ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఇస్తామని క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ వాగ్దానం చేశాడనే వార్తలపై సౌదీ అరేబియా జట్టు మేనేజర్ హెర్వ్ రెనార్డ్ కూడా ఖండించారు. FIFA ద్వారా ప్రపంచంలో 51వ ర్యాంక్‌లో ఉన్న సౌదీ అరేబియా వారి గ్రూప్ C ఓపెనర్‌లో నం.3 అర్జెంటీనాను ఓడించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. FIFA వరల్డ్ కప్ లో టైటిల్‌ ఫేవరెట్‌ అయిన అర్జెంటీనాపై సంచలన విజయం సాధించిన సౌదీ అరేబియా జట్టుకు ఆ దేశ రాజు టీంలోని ప్రతి ఆటగాడికి ఖరీదైన రోల్స్‌ రాయిస్‌ ఫాంటమ్‌ కారును బహుమతిగా ఇస్తున్నట్లు సౌదీ రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సౌద్‌ ప్రకటించారని పలు నివేదికలు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ వార్తలు నిజం కాదని అల్షెహ్రీ, సౌదీ అరేబియా జట్టు మేనేజర్ హెర్వ్ రెనార్డ్ స్పష్టం చేశారు.

అర్జెంటీనా ఓటమిని ప్రపంచకప్ చరిత్రలోనే అతి పెద్ద ఎదురుదెబ్బగా అభివర్ణిస్తున్నారు. ఓటమి తర్వాత లియోనెల్ మెస్సీ ముఖం దాచుకుని కనిపించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అర్జెంటీనా ముందు సౌదీ అరేబియా ఎక్కడా నిలవలేదు. వెటరన్ లియోనెల్ మెస్సీ నాయకత్వంలో అర్జెంటీనా ఏకపక్షంగా ప్రత్యర్థి సౌదీ అరేబియాను ఓడిస్తుందని అనుభవజ్ఞులు విశ్వసించారు. కానీ అది జరగలేదు.