Site icon HashtagU Telugu

Delhi: మోడీతో సౌదీ ప్రధాని భేటీ

Delhi

New Web Story Copy 2023 09 11t093510.454

Delhi: సౌదీ అరేబియా ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఈరోజు హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వచ్చారు. సెప్టెంబర్ 9-10 తేదీలలో జరిగిన జీ20 సమిట్ కు హాజరైన ఆయన సెప్టెంబర్ 11న ఇక్కడే బస చేయనున్నాడు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ దృవీకరించింది. ప్రధాని మోదీతో సమావేశానికి ముందు, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో లాంఛనప్రాయ రిసెప్షన్ అందుకుంటారు.హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో సమావేశమైన తర్వాత, సౌదీ క్రౌన్ ప్రిన్స్ అదే వేదికపై మధ్యాహ్నం 12 గంటలకు భారత్-సౌదీ వ్యూహాత్మక భాగస్వామ్య మండలి మొదటి సమావేశానికి సంబంధించిన దానిపై సంతకం చేస్తారని భావిస్తున్నారు. అనంతరం సౌదీ అరేబియా ప్రధాని సాయంత్రం 6:30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. రాత్రి 8.30 గంటలకు న్యూఢిల్లీ నుంచి బయలుదేరుతారు. అతను చివరిసారిగా ఫిబ్రవరి 2019లో భారతదేశాన్ని సందర్శించారు. భారతదేశానికి అతను రెండో సారి వచ్చారు.

Also Read: Accident : సూర్యాపేట వ‌ద్ద ఏపీ హైకోర్టు జ‌డ్డి కారుకు ప్ర‌మాదం.. స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ జ‌డ్జి