Astrology : ప్రస్తుతం శనివారం రోజు చంద్రుడు కుంభ రాశిలో సంచరిస్తూ, పూర్వా భాద్రపద నక్షత్ర ప్రభావాన్ని కలిగించనున్నారు. శివ యోగం, శష్ రాజయోగం ఏర్పడుతున్న నేపథ్యంలో కొన్ని రాశుల వారికి శనిదేవుని అనుగ్రహం లభించనుండగా, మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు ఉండొచ్చు. మేషం నుండి మీనం వరకు 12 రాశులపై ఈ రోజున కలిగే ప్రభావాలు, అదృష్టశాతం, అలాగే అనుసరించాల్సిన పరిహారాలు చూద్దాం.
మేష రాశి (Aries Horoscope Today)
వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు కలిగే రోజు. ప్రజల మద్దతుతో కొన్ని పనులను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభించే సూచనలు ఉన్నాయి. సాయంత్రం పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం. ఖర్చులు నియంత్రించాలి. అవసరమైన షాపింగ్‌కు వ్యయం జరగొచ్చు.
అదృష్ట శాతం: 93%
పరిహారం: రావి చెట్టుకు పాలు కలిపిన నీరు సమర్పించాలి.
వృషభ రాశి (Taurus Horoscope Today)
కెరీర్‌లో పురోగతి సాధించగలరు. కుటుంబంలో వివాహ సంబంధ సమస్యలు పెద్దల సహాయంతో పరిష్కరించుకోవచ్చు. రాజకీయాల్లో ఉన్నవారికి ప్రజల మద్దతు పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు పార్ట్‌టైమ్ అవకాశాలను పరిశీలించవచ్చు.
అదృష్ట శాతం: 77%
పరిహారం: గోమాతకు పచ్చి గడ్డి తినిపించాలి.
మిధున రాశి (Gemini Horoscope Today)
పిల్లల చదువు లేదా వ్యాపార ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రేమికులకు మంచి సమయం. డబ్బు లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి. పిల్లల నుంచి శుభవార్త వచ్చే అవకాశం.
అదృష్ట శాతం: 86%
పరిహారం: శివలింగానికి పాలు సమర్పించాలి.
కర్కాటక రాశి (Cancer Horoscope Today)
విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు పొందగలరు. ఆకస్మిక ధనలాభ సూచనలు. కుటుంబ అవసరాలు తీర్చుకునే వీలుంది. జీవిత భాగస్వామి సలహా ప్రయోజనకరంగా మారుతుంది. స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసే అవకాశం.
అదృష్ట శాతం: 74%
పరిహారం: తెల్లని వస్తువులను దానం చేయాలి.
సింహ రాశి (Leo Horoscope Today)
కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో మంచి ఫలితాలు. గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. విద్యార్థులకు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు. వ్యాపారులు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి రావొచ్చు.
అదృష్ట శాతం: 69%
పరిహారం: శివ చాలీసా పారాయణం చేయాలి.
కన్య రాశి (Virgo Horoscope Today)
పిల్లల నుంచి శుభవార్తలు వినొచ్చు. వ్యాపారంలో భాగస్వామ్యం లాభదాయకంగా మారొచ్చు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనాలి. సోదరులతో విభేదాలు తొలగుతాయి. ఉన్నత విద్యార్ధులకు అనుకూల సమయం.
అదృష్ట శాతం: 91%
పరిహారం: గురువు లేదా పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి.
తులా రాశి (Libra Horoscope Today)
రాజకీయాల్లో ఉన్నవారికి గౌరవ ప్రతిష్ట పెరుగుతుంది. పాత రుణ భారాన్ని తగ్గించుకునే వీలుంది. తండ్రికి కంటి సమస్యల సూచనలు. కుటుంబ ఆనందం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల అభ్యర్థనలు ఉండొచ్చు.
అదృష్ట శాతం: 92%
పరిహారం: శ్రీ కృష్ణ భగవానుని పూజించాలి.
వృశ్చిక రాశి (Scorpio Horoscope Today)
స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులు సర్‌ప్రైజ్ పార్టీ ఇవ్వవచ్చు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే లాభదాయకం. ఆస్తి సంబంధమైన వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
అదృష్ట శాతం: 97%
పరిహారం: సరస్వతి మాతను పూజించాలి.
ధనుస్సు రాశి (Sagittarius Horoscope Today)
పని విషయంలో ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశం. కొత్త ఆవిష్కరణలు ప్రయోజనకరంగా మారతాయి. రుణం ఇవ్వాల్సిన అవసరమైతే పునరాలోచించాలి. బంధువుల నుంచి ఆర్థిక సహాయం పొందే అవకాశం.
అదృష్ట శాతం: 85%
పరిహారం: రావి చెట్టు వద్ద దీపం వెలిగించాలి.
మకర రాశి (Capricorn Horoscope Today)
ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. స్నేహితుల సహాయంపై పూర్తిగా ఆధారపడకండి. విద్యార్ధులకు అనుకూలత. అతిథుల రాక వల్ల ఖర్చులు పెరుగొచ్చు.
అదృష్ట శాతం: 72%
పరిహారం: శ్రీ మహావిష్ణువు ను ఆరాధించాలి.
కుంభ రాశి (Aquarius Horoscope Today)
ప్రేమ జీవితంలో సమస్యలు ఏర్పడే అవకాశం. భవిష్యత్‌పై ఆందోళన పెరిగొచ్చు. అనుకోని ప్రయాణ సూచనలు. జీవిత భాగస్వామితో కలహ సూచనలు. పనులపై మరింత దృష్టి పెట్టాలి.
అదృష్ట శాతం: 79%
పరిహారం: పసుపు వస్తువులను దానం చేయాలి.
మీన రాశి (Pisces Horoscope Today)
పిల్లల భవిష్యత్తుపై ఆందోళన కలగొచ్చు. స్నేహితుల సపోర్ట్ పెరుగుతుంది. బంధువులకు అప్పుగా డబ్బు ఇవ్వడం వల్ల సమస్యలు తలెత్తొచ్చు. వైవాహిక జీవితంలో శుభ పరిణామాలు.
అదృష్ట శాతం: 76%
పరిహారం: గాయత్రీ చాలీసా పారాయణం చేయాలి.
(గమనిక: జ్యోతిష్య సమాచారం పూర్తిగా విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. దీన్ని సూచనాత్మకంగా మాత్రమే పరిగణించాలి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.)
Banks Big Changes : బ్యాంకుల టైమింగ్స్.. ప్రతివారం వర్కింగ్ డేస్.. బిగ్ అప్‌డేట్?