Site icon HashtagU Telugu

Young Shooter Isha Singh: యువ షూటర్ ఇషా సింగ్ ను సత్కరించిన SATS..!

Cropped (3)

Cropped (3)

అంతర్జాతీయ షూటింగ్ గత కొంత కాలంగా సంచలనాలు సృష్టిస్తున్న హైదరాబాదీ యువ షూటర్ ఇషా సింగ్ ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఘనంగా సత్కరించింది. శాట్స్ షూటింగ్ కోచ్ సందీప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ , శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఉదయ్ పిలానీ హాజరయ్యారు. ఈషా సింగ్ లాంటి ప్లేయర్ తెలంగాణ నుంచి రావడం ఎంతో గర్వ పడే విషయమని, ఆమెను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రుల కృషిని వారంతా ప్రత్యేకంగా అభినందించారు.

ఆమెను రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచీ ప్రోత్సహిస్తుందని, రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ సహకారం ఉంటుందని శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు, కోచ్ ప్రోత్సాహం కారణంగానే అంతర్జాతీయ స్థాయిలో తాను మెడల్స్ సాధిస్తున్నాని ఇషా సింగ్ చెప్పింది. అంతకు ముందు రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఈషా, ఆమె తల్లిదండ్రులు మర్యాదపూర్వకంగా కలిశారు.