Site icon HashtagU Telugu

Plastic For Trash: సర్పంచ్ ఐడియా ఆ గ్రామాన్ని పూర్తిగా మార్చేసింది.. ఆదర్శ గ్రామంగా నిలిచింది

Gexplies8no7smfl

Gexplies8no7smfl

Plastic For Trash: ప్రస్తుత కాలంలో పొలిటీషియన్ల మీద ప్రజలకు నమ్మకం పోయింది. పొలిటీషియన్లను చూస్తుంటే ప్రజలు అసహ్యించుకునే రోజులు వచ్చాయి. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ప్రజల్లో తిరిగే ప్రజాప్రతినిధులు.. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు వచ్చేంత వరకు కనిపించకుండా పోతున్నారు. ప్రజలు కలిసి సమస్యలు చెప్పుకోవాలని ప్రయత్నించినా అందుబాటులో ఉండరు. తమ నియోజకవర్గంలో కాకుండా సిటీలలో ఉంటూ ఉంటారు. అప్పడప్పుడు చుట్టపుచూపుగా నియోజకవర్గానికి వస్తూ ఉంటారు.

అయితే ఓ గ్రామ సర్పంచ్ మాత్రం ఆదర్శంగా నిలుస్తున్నాడు. కేవలం 15 రోజుల్లోనే గ్రామాన్ని ప్టాస్టిక్ రహిత గ్రామంగా మార్చాడు. కశ్మీర్ లోని నదివార పంచాయతీలో ఇది చోటుచేసుకుంది. ఇందుకోసం సర్పంచ్ ఓ వినూత్న ఐడియాను ఆలోచించాడు. ప్లాస్టిక్ ఇచ్చి బంగారం తీసుకోండి అనే ఆఫర్ ప్రకటించాడు. ఇందులో బాగంగా 20 క్వింటాళ్ల ప్లాస్టిక్ వ్యర్థాలు ఇస్తే ఒక బంగారు నాణెం ఇస్తామంటూ ప్రకటించారు. దీంతో ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోంది. ప్రజలు ప్లాస్టిక్ ను సేకరించి అందించారు. దీంతో 15 రోజుల్లోనే ఆ గ్రామం ప్టాస్టిక్ రహిత గ్రామంగా మారిపోయింది.

దక్షిణ కశ్మీర్ లోని అనంత్ బాగ్ జిల్లాలోని హిల్లర్ షహాబాద్ బ్లాక్ లో ఆ గ్రామం ఉంది. బంగారం ఇస్తామని ఆఫర్ పెట్టడంతో గ్రామస్తులు ప్లాస్టిక్ మొత్తం సేకరించి అధికారులకు అందించారు. దీంతో గ్రామం క్లీన్ గా మారిపోయింది. సర్పంచ్ అహ్మద్ ప్రస్తుతం న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. గ్రామంలో ఆయనకు మంచి పేరు ఉంది. దీంతో ఆయన మాటను గ్రామస్తులందరూ పాటించారు. అధికారులు ఆ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా ప్రకటించారు. అంతేకాకుండా అన్ని గ్రామాలు కూడా ఈ ఆఫర్ ను ప్రకటిస్తున్నాయి. అధికారులు కూడా సర్పంచ్, గ్రామస్తులను అభినందిస్తున్నారు. ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ప్రకటించారు.