Title Song: ‘సర్కారు వారి పాట’ టైటిల్ సాంగ్ వచ్చేసింది!

సర్కారు వారి పాటలోని మిగిలిన పాటల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Sarkarivaripata

Sarkarivaripata

మొదటి రెండు పాటలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచినందున.. మహేష్ బాబు టైటిల్ రోల్ లో నటిస్తున్న సర్కారు వారి పాటలోని మిగిలిన పాటల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో వచ్చేసింది. ఈ పాట వాస్తవానికి కథానాయకుడి దూకుడును, కర్తవ్యాన్ని వివరిస్తుంది. థమన్ మ్యూజిక్ లో సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ గాయని హారిక నారాయణన్ స్వరంలో ప్రాణం పోసింది. అనంత శ్రీరామ్ సాహిత్యం మహేష్ బాబు హీరోయిజాన్ని ఎలివేట్ చేసింది. లైన్స్ ఎక్కువగా మాస్‌ని ఆకట్టుకుంటున్నాయి.

సినిమా సన్నివేశాలను ఎలివేట్ చేయడానికి కూడా బీజీఎం బాగా హెల్ప్ చేసింది. నిజానికి పాటకి అంత ఎనర్జీ ఉంది. ఈ పాటలో మహేష్ బాబు క్రూరంగా కనిపిస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేశ్ బాబుకు ప్రేయసిగా కీర్తి సురేష్ కనిపించనుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న సర్కార్ వారి పాట మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  Last Updated: 23 Apr 2022, 11:29 AM IST